అయ్యో పాపం.! నాన్నా అని పలుకుతూ ప్రాణాలు విడిచిన చిన్నారి..

| Edited By: Srikar T

Aug 11, 2024 | 3:04 PM

రోజు స్కూలుకి వెళ్లి వచ్చే తన చిట్టి తల్లి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు తండ్రి. స్కూల్ బస్సు ఆగింది. బస్సు నుంచి ఆ చిట్టితల్లి నవ్వుతూ కిందకు దిగింది. అదే చిరునవ్వుతో నాన్నా అంటూ రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఇంతలో దిగిన బస్సే ఆ చిన్నారిని ఢీకొంది.

అయ్యో పాపం.! నాన్నా అని పలుకుతూ ప్రాణాలు విడిచిన చిన్నారి..
Visakhapatnam
Follow us on

రోజు స్కూలుకి వెళ్లి వచ్చే తన చిట్టి తల్లి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు తండ్రి. స్కూల్ బస్సు ఆగింది. బస్సు నుంచి ఆ చిట్టితల్లి నవ్వుతూ కిందకు దిగింది. అదే చిరునవ్వుతో నాన్నా అంటూ రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఇంతలో దిగిన బస్సే ఆ చిన్నారిని ఢీకొంది. ఆ చిట్టి తల్లి ప్రాణం విలవిల్లాడుతూ అక్కడికక్కడే ఊపిరి వదిలింది. తండ్రి కళ్ళముందే జరిగిన ఈ ఘటన ఆ కుటుంబానికి తీరని శ్లోకాన్ని మిగిల్చింది. దీంతోపాటూ అక్కడి గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది.

విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన బంటుపల్లి సురేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్ల ఆద్య పద్మనాభం మండలం రెడ్డిపల్లిలోని పాఠశాలలో ఎల్‎కేజీ చదువుతోంది. రోజూ నవ్వుకుంటూ స్కూల్‎కి వెళ్లి తిరిగి చిరునవ్వుతో వచ్చి తల్లిదండ్రులను పలకరించేది. రోజు మాదిరిగానే శనివారం ఉదయం స్కూల్‎కి చలాకీగా వెళ్ళింది. స్కూలు ముగిసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి స్కులు బస్సులో ఇంటివద్దకు చేరుకుంది. ఆద్య కోసం తండ్రి సురేష్ అవతలి రోడ్డులో వేచి చూస్తున్నాడు. తానే స్వయంగా ఇంటికి తీసుకెళ్లెందుకు బస్ స్టాప్ వద్దకు చేరుకున్నాడు. అప్పుడే బస్సు వచ్చింది బస్సు లోపల నుంచి తండ్రిని చూసి చేయి ఊపింది ఆద్య.

బస్సు దిగిన ఆద్య అవతలి రోడ్డులో ఉన్న తండ్రిని చిరునవ్వుతో పలకరించింది. బ్యాగు తగిలించుకొని తండ్రి దగ్గరకు సంతోషంగా పరుగులు తీసింది. బాలిక బస్సు దిగి రోడ్డు దాటిందనుకుని ఆ బస్సును ముందుకు నడిపాడు డ్రైవర్. ఇదే సమయంలో ఆమెను దింపిన స్కూల్ బస్సు.. ఆద్యను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ చిట్టి తల్లి విలవిలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో ఆ తండ్రి గుండెలు పట్టుకున్నాడు. విషయం తెలిసి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. గ్రామమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. ఇటువంటి కష్టం దేవుడు ఎవరికి ఇవ్వకూడదని ఆవేదన చెందుతున్నారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‎ను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..