శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత సంచారం

| Edited By:

Aug 30, 2019 | 3:30 PM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. వాస్తవానికి శ్రీశైలం పుణ్యక్షేత్రం చుట్టూ… నల్లమల అడవులు, కొండలే ఉంటాయి. పైగా అది టైగర్ రిజర్వ్ ప్రాంతం కూడా. అయితే భక్తులు వెళ్లే మార్గంలో చిరుత సంచారం చాలా అరుదు. అయితే రింగ్ రోడ్డు సమీపంలో పులిసంచారాన్ని గమనించిన కొందరు భక్తులు.. సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆలయానికి దగ్గర్లో చిరుత తిరుగుతున్నట్లు వీడియోలో కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు.. భక్తులకు రింగు రోడ్డువైపు […]

శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత సంచారం
Follow us on

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. వాస్తవానికి శ్రీశైలం పుణ్యక్షేత్రం చుట్టూ… నల్లమల అడవులు, కొండలే ఉంటాయి. పైగా అది టైగర్ రిజర్వ్ ప్రాంతం కూడా. అయితే భక్తులు వెళ్లే మార్గంలో చిరుత సంచారం చాలా అరుదు. అయితే రింగ్ రోడ్డు సమీపంలో పులిసంచారాన్ని గమనించిన కొందరు భక్తులు.. సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆలయానికి దగ్గర్లో చిరుత తిరుగుతున్నట్లు వీడియోలో కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు.. భక్తులకు రింగు రోడ్డువైపు వెళ్లవద్దంటూ హెచ్చిరిస్తున్నారు. మైకుల్లో భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. అదే దారిలో సాక్షి గణపతి ఆలయం, హఠకేశ్వరం, ఫాలధార, పంచధార వంటి ఆలయాలు, యాత్రా స్థలాలు, పర్యాటక ప్రదేశాలున్నాయి. అయితే ప్రస్తుతం అధికారులు ఈ దారుల్లో రాకపోకలను నిలిపివేశారు. సీసీ కెమెరాలను చెక్ చేస్తున్న అధికారులు చిరుత అడుగు జాడలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని తెలిపారు.