మ్యాజిక్ చేసినట్టు ఒక్కసారిగా జాలువారిన భారీ కొండ.. బిత్తరపోయిన జనం.. విషయం ఏంటంటే?

|

Jun 02, 2022 | 7:11 PM

Landslide: దువ్వపాలెం క్వారీలో కొండ చరియలు విరిగి పడ్డాయి. రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ..

మ్యాజిక్ చేసినట్టు ఒక్కసారిగా జాలువారిన భారీ కొండ.. బిత్తరపోయిన జనం.. విషయం ఏంటంటే?
Broke Out At Duvvapalam Qua
Follow us on

పల్నాడు జిల్లా వినుకొండలో పెను ప్రమాదం తప్పింది. వికలాంగుల కాలనీలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో రెండు ఇళ్లులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పెద్ద పెద్ద బండ రాళ్లు పడడంతో గోడలు బీటలు వారాయి. బండరాళ్లు పడ్డ సమయంలో ఇళ్లలో ఎవ్వరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డు నిర్మాణ పనుల వల్లే ఇలా జరిగిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులకు, బాధితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. మరోవైపు ఇవాళ విశాఖలోని దువ్వపాలెం క్వారీలో కొండచరియలు ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందకు జారిపడ్డాయి. ఘటన జరిగిన సమయంలో జనం లేకపోవడంతో పెను ముప్పు తప్పింది.  దువ్వపాలెం క్వారీలో కొండ చరియలు విరిగి పడ్డాయి. రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే కొండ చరియలు ఎందుకు విరిగిపడ్డాయన్నది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే అది మట్టి కొండ కావడంతో ఇలా కూలిందని స్థానికులు అంటున్నారు. కొండ విరిగిపడుతున్న సమయంలో ఓ భూ ప్రకంపంలా కనిపించింది.

ఏపీ వార్తల కోసం