కర్నూలులో కలకలం.. శిశువు మృతి చెందిందన్న డాక్టర్ల మాటపై ఆగ్రహావేశాలు, కే షీట్లో ఒక పేపరు లేకపోవడంతో అనుమానాలు

|

Jul 13, 2021 | 8:59 AM

కే(Key Information Sheet) షీట్ లో ఒక పేపరు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదంటున్నారు.

కర్నూలులో కలకలం..  శిశువు మృతి చెందిందన్న డాక్టర్ల మాటపై ఆగ్రహావేశాలు,  కే షీట్లో ఒక పేపరు లేకపోవడంతో అనుమానాలు
Kurnool Government Hospital
Follow us on

Government Hospital Kurnool: కర్నూలు పెద్దాసుపత్రిలో శిశువు తారుమారు వ్యవహారం కలకలం రేపుతోంది. తమ బిడ్డను తారుమారు చేశారంటూ బాలింత బంధువులు ఆందోళనకు దిగారు. దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా మూడో కాన్సు కోసం ఆదివారం పెద్దాసుపత్రి ప్రసూతి విభాగానికి వచ్చింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యం బాగాలేక పోవడంతో మధ్యాహ్నం వైద్యులు చిన్న పిల్లలు వార్డుకు తరలించి ఎన్ఐసీయూలో ఉంచారు.

అయితే రాత్రి 8 గంటలకు శిశువు చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో రజియా, ఆమె బంధువులు ఖంగుతిన్నారు. తమ బంధువులు చూసిన శిశువు, మృతశిశువు ఒకేలా లేరని, బిడ్డను తారుమారు చేశారని రజియా ఆరోపించింది. ఆమె బంధువులు గైనిక్ వార్డు వద్ద ఆందోళనకు దిగారు.

తన బిడ్డను తెచ్చివ్వాలని తల్లి రజియా డిమాండ్ చేస్తోంది. అయితే కే(Key Information Sheet) షీట్ లో ఒక పేపరు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Koushik Reddy: ‘ఒకే ఫోన్‌ కాల్‌’.. హుజురాబాద్‌తో పాటు తెలంగాణ రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపింది