AP News: పొలంలో రైతుకు మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని చూడగా..

| Edited By: Ram Naramaneni

Jul 21, 2024 | 3:32 PM

వజ్రం..!! ఈ పేరెత్తితేనే మనస్సు పరవశిస్తుంది.. ఎప్పటికైనా చిన్న వజ్రాన్నైనా ధరించాలని... మగువలు ఎంతగానో ఆశపడతారు. అలాంటి ఓ విలువైన వజ్రం కర్నూలు జిల్లాలో పొలం పనులు చేస్తున్న ఓ రైతుకు దొరికింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

AP News: పొలంలో రైతుకు మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని చూడగా..
Farmer (Representative Picture)
Follow us on

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో రైతు పొలం పనులు చేస్తుండగా.. లక్ కలిసొచ్చి వజ్రం దొరికింది. దీంతో ఆ రైతు పంట పండింది.  దొరికిన వజ్రాన్ని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారి ఆరు లక్షల రూపాయలు నగదు, నాలుగు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు. ఈ సంవత్సరం వర్షాలు భారీ వర్షాలు కురవడంతో… పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి వంటి ప్రాంతాల్లో విలువైన వజ్రాలు లభిస్తుండడంతో  రైతులు, కూలీలు వజ్రాల అన్వేషణ చేస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపుగా 48 వజ్రాలు దొరికాయి. దొరికిన వజ్రాలను జొన్నగిరి,పెరవలి, గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు.

తాజాగా రైతుకు దొరికిన వజ్రానికి… ఆరు లక్షల రూపాయలు నగదు, నాలుగు తలలు బంగారు రావడంతో వజ్రాలు అన్వేషికులు మరింత స్పీడ్ పెంచారు. తమకు ఓ చిన్న వజ్రమైనా దొరక్కపోదా అని ఆశగా వెతుకులాట సాగిస్తున్నారు. అయితే గత పది రోజుల్లో జొన్నగిరిలో ఆరు వజ్రాలు దొరకడం విశేషం. వర్షం రావడంతో వజ్రాలు దొరుకుతున్నాయి అన్న సమాచారంతో వజ్రాల అన్వేషకులు భారీ స్థాయిలో జొన్నగిరికి చేరుకుంటున్నారు. కొందరు నెలలు నుండి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. అయితే కొందరు రైతులు ఇప్పటికే పంటలు వేయడంతో వజ్రాల అన్వేషకులు పంట పొలంలో తిరగడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు అయితే తమ పొలాల్లో వజ్రాలు అన్వేషణకు అనుమతి లేదని బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..