AP: నల్ల నేరేడు పండ్లు తిని ఒక చిన్నారి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం.. అలా చేయడం వల్లే

|

Jun 12, 2022 | 3:20 PM

కోసిగిలో ఓ కుటుంబాన్ని విధి వెంటాడింది. నల్ల నేరేడు పళ్లు తినడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

AP: నల్ల నేరేడు పండ్లు తిని ఒక చిన్నారి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం.. అలా చేయడం వల్లే
Representative image
Follow us on

Kurnool district: కర్నూలు జిల్లా కోసిగి(Kosigi)లో విషాద సంఘటన చోటు చేసుకుంది.. నల్ల నేరేడు పండ్లు తిని ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.  కోసిగి మూడో వార్డుకు చెందిన బూగేని మాదేవి తన కూమరులైన ఇద్దరు పిల్లలకు తన అత్త తెచ్చిన నేరేడు పండ్లను తినిపించింది. తన పిల్లలతో పాటు ఇంటికి వచ్చిన శ్రీరాములు అనే బాలుడికి కూడా ఆ పండ్లను ఇచ్చింది. మాదేవి కూడా కొన్ని పండ్లు తిన్నది. ఆ కాసేపటికే నలుగురు సృహ కోల్పోయారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో హర్ష అనే రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. మిగిలిన ఇద్దరు చిన్నారులతో పాటు మాదేవికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నరసప్ప అనే రైతు పొలం నుంచి బూగేని మాదేవి అత్త నరసమ్మ ఈ నేరేడు పండ్లను తీసుకొచ్చింది. ఆ పండ్లను తిన్న తర్వాతే వాళ్లు అస్వస్థతకు గురయ్యారు. క్రిమిసంహారక మందులకు సంబంధించిన కవర్‌లో పండ్లు తెచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అందువల్లే వాళ్ల శరీరంలోకి పాయిజన్ వెళ్లి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.