కోరుకొండ స్వామివారి తెప్పోత్సవం

|

Nov 09, 2019 | 4:55 PM

తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామివారి దేవుని కోనేరు దగ్గర కార్తీకమాసం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు సాయంత్రం నిర్వహించే స్వామివారి తెప్పోత్సవం వేడుకలకు అంతా సిద్ధం అయింది. దేవుని కోనేరులో హంస వాహనాన్ని సిద్ధం చేశారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దత్తత దేవాలయంగా ఉన్న కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం అన్నవరం దేవస్థానం అధికారులు, స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, […]

కోరుకొండ స్వామివారి తెప్పోత్సవం
Follow us on
తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామివారి దేవుని కోనేరు దగ్గర కార్తీకమాసం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు సాయంత్రం నిర్వహించే స్వామివారి తెప్పోత్సవం వేడుకలకు అంతా సిద్ధం అయింది. దేవుని కోనేరులో హంస వాహనాన్ని సిద్ధం చేశారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దత్తత దేవాలయంగా ఉన్న కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం అన్నవరం దేవస్థానం అధికారులు, స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కోరుకొండ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎస్పి రంగ రాజ భట్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. అందుకోసం దేవాదాయ శాఖ ఉద్యోగులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కోనేరు వద్ద హంసవాహనాన్ని ఏర్పాట్లను స్థానిక పోలీసులు, వైయస్సార్ సిపి నాయకులు అయిల రామకృష్ణ, నేతుల చిన్ని, పసుపులేటి బుల్లయ్య నాయుడు, బొండాడ చందు, నల్లమోలు భాస్కర్, కోడూరి సత్తిరెడ్డి తదితరులు పరిశీలించారు.