Kodalinani Comments: ఎన్టీఆర్‌ పేరు పలికే అర్హతలేని ఏకైక వ్యక్తి చంద్రబాబు : ఏపీ మంత్రి కొడాలి నాని

|

Jan 18, 2021 | 7:51 PM

Kodalinani Comments: సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానాలకు చేరిన మహావ్యక్తి నందమూరి తారక రామారావు అని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్డీఆర్‌ వర్థంతి...

Kodalinani Comments: ఎన్టీఆర్‌ పేరు పలికే అర్హతలేని ఏకైక వ్యక్తి చంద్రబాబు : ఏపీ మంత్రి కొడాలి నాని
Follow us on

Kodalinani Comments: సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానాలకు చేరిన మహావ్యక్తి నందమూరి తారక రామారావు అని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్డీఆర్‌ వర్థంతి సందర్భంగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిపై నాని విమర్శల వర్షం కురిపించారు. వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు అయిన చంద్రబాబు సొంత మామనే పార్టీ నుంచి మెడపట్టి గెంటేశాడని మండిపడ్డారు.

ఎన్డీఆర్‌ చావుకు కారణం ఎవరో అందరికి తెలుసుని అన్నారు. పదవుల కోసం మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న తెచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదని, వర్థంతి, జయంతి నాడే చంద్రబాబుకు ఎన్డీఆర్‌ గుర్తొస్తారని ఆరోపించారు. పదవుల కోసం దిగజారే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. చంద్రబాబుకు ప్రపంచరత్న బిరుదు ఇవ్వాలని ఎద్దెవా చేశారు.

చంద్రబాబు బతికున్నన్ని రోజులు ఎన్టీఆర్‌కు భారతరత్న రాదని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తూనే ఉంటాడు కానీ.. ఢిల్లీలో చక్రం తిప్పినప్పుడు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. అలాగే బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో అఖిలప్రియ అరెస్టుపై చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పేరు పలికే అర్హతలేని ఏకైక వ్యక్తి చంద్రబాబు అని కొడాలి నాని విమర్శలు చేశారు.


Also Read:

AP CM Jagan Delhi tour: రేపు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. అమిత్‌షాతో భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ