Crop Damages: ఉన్నట్టుండి కుంగిపోతున్న భూమి.. అరటి తోటల్లో భారీ గుంతలు.. కారణం ఇదేనట..

|

Nov 28, 2021 | 1:27 PM

ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద గుంత పడుతోంది. సాఫీగా ఉన్న నేల బీటలు వారుతోంది. ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. కడప జిల్లా వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్ట్ బాధిత గ్రామాల్లో..

Crop Damages: ఉన్నట్టుండి కుంగిపోతున్న భూమి.. అరటి తోటల్లో భారీ గుంతలు.. కారణం ఇదేనట..
Uranium Factory Damages Cro
Follow us on

Uranium Factory Damages Crops: ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద గుంత పడుతోంది. సాఫీగా ఉన్న నేల బీటలు వారుతోంది. ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. కడప జిల్లా వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్ట్ బాధిత గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులు ఇవి. ఇదంతా తుమ్మలపల్లికి చెందిన వెంకటరాములు అనే రైతు పొలం జరిగింది. ఈ ఒక్కరైతు పొలంలో మాత్రం జరగడంలేదు.. ఆ చుట్టు పక్కల ఉన్న అన్ని వ్యవసాయ క్షేత్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  భూమి ఇలా గుంతలు గుంతలుగా మారింది. మూడు చోట్ల పది అడుగుల మేర గుంతలు పడ్డాయి.  మరో ఇద్దరు రైతుల పొలాల్లోనే ఇలాగే భూమి కుంగిపోయింది. పంట సాగు చేసుకోవాలంటేనే భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.

తుమ్మలపల్లికి సమీపంలో యురేనియం కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. పరిమితులకు మించి అండర్ గ్రౌండ్ తవ్వకాలు జరపడం వల్లే భూమిపై గుంతలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు రైతులు. బ్లాస్టింగ్ కారణంగా ఇళ్లకు పగుళ్లు కూడా వస్తున్నాయనీ.. పంటలు సాగు చేసుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు.

గుంతలు పడిన ప్రాంతాన్ని పొల్యూషన్ బోర్డ్ డైరెక్టర్ శివకృష్ణారెడ్డి పరిశీలించారు. యురేనియం అధికారులపై మండిపడ్డారు. బాధితులకు తగిన పరిష్కారం చేయలనీ.. లేకపోతే పారాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించింది పొల్యూషన్ బోర్డ్.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి.. చాణక్యనీతిలో సంచలన విషయాలు..

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే తెలుసా.. ఇది ఎక్కడ ప్రారంభమైంది.. భారతదేశంలో ఎప్పుడు వచ్చింది..