అనకాపల్లిలో బెల్లం ధరలకు రెక్కలు..ఎందుకంటే?

|

Oct 04, 2019 | 7:27 PM

ఈ యేడు మధ్యతరగతి జనం పండుగ జరుపుకునే పరిస్థితి కనిపించడం లేదు. దసరా అనగానే అందరికీ పిండివంటలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా అరిసెలు, బూరెలు ఈ సీజన్‌లో ఎక్కువగా చేస్తారు.  కానీ బెల్లం ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఈసారి పేద ప్రజలు స్వీట్‌కు సంభందించిన ఏ ఐటమ్ చెయ్యాలన్నా జంకుతున్నారు. ఎందుకంటే ప్రతి వంటకానికి బెల్లం కావాల్సిందే. ముఖ్యంగా వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో (ఎన్టీఆర్ […]

అనకాపల్లిలో బెల్లం ధరలకు రెక్కలు..ఎందుకంటే?
Follow us on

ఈ యేడు మధ్యతరగతి జనం పండుగ జరుపుకునే పరిస్థితి కనిపించడం లేదు. దసరా అనగానే అందరికీ పిండివంటలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా అరిసెలు, బూరెలు ఈ సీజన్‌లో ఎక్కువగా చేస్తారు.  కానీ బెల్లం ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఈసారి పేద ప్రజలు స్వీట్‌కు సంభందించిన ఏ ఐటమ్ చెయ్యాలన్నా జంకుతున్నారు. ఎందుకంటే ప్రతి వంటకానికి బెల్లం కావాల్సిందే. ముఖ్యంగా వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో (ఎన్టీఆర్ మార్కెట్) ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. దసరా సందర్భంగా పిండి వంటల చేసేందుకు..క్వాలిటీ ఉన్న బెల్లం కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎప్పుడూ లేనంతగా రేట్లు పెరిగాయి. గడిచిన నాలుగు రోజుల్లోనే 40 శాతం రేటు పెరిగింది. ప్రస్తుతం క్వింటా బెల్లం ధర 450 రూపాయలు పలుకుతుంది.