కరోనాపై అలసత్వం వద్దు.. కలెక్టర్లతో సీఎం

|

Sep 29, 2020 | 2:59 PM

ఏపీలో కరోనా వ్యాప్తిపై అలసత్వం వద్దని జిల్లాల కలెక్టర్లను హెచ్చరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు 12 నుంచి 8.3కి తగ్గడం మంచి పరిణామమే అయినా....

కరోనాపై అలసత్వం వద్దు.. కలెక్టర్లతో సీఎం
Follow us on

Jagan warns officials over corona virus spread: ఏపీలో కరోనా వ్యాప్తిపై అలసత్వం వద్దని జిల్లాల కలెక్టర్లను హెచ్చరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు 12 నుంచి 8.3కి తగ్గడం మంచి పరిణామమే అయినా.. తగ్గుతుందన్న అలసత్వాన్ని మాత్రం దరిచేరనీయవద్దని ఆయన కలెక్టర్లకు చెప్పారు. కోవిడ్-19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి మంగళవారం నాడు జిల్లాల కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

‘‘ రాష్ట్రంలో టెస్ట్‌లు పెరిగాయి, కేసులు తగ్గుతున్నాయి.. కోవిడ్‌ తగ్గుతుందనడానికి ఇది నిదర్శనం కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే మనం దానికి తగిన విధంగా అప్రమత్తంగా ఉండాలి.. జనవరి కల్లా వ్యాక్సిన్‌ వచ్చే పరిస్ధితి కనిపిస్తుంది.. 104 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే టెస్ట్‌లు, హాస్పిటల్స్ వివరాలు అందాలి .. ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయగానే అరగంటలోనే బెడ్‌ అందుబాటులో ఉందో లేదో చెప్పాలి.. ’’ అని కలెక్టర్లను అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి జగన్.

కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ట్రీట్‌ చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని, కోవిడ్‌ హాస్పిటల్స్‌ లిస్ట్‌ గ్రామ సచివాలయాల్లో ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఎంప్యానల్‌ హస్పిటల్స్‌ లిస్ట్‌ కూడా అందుబాటులో ఉంచాలని, 240 హాస్పిటల్స్‌లో ఫుడ్‌, శానిటేషన్, ఇన్‌ఫ్రా, స్టాఫ్‌ వీటిపై మానిటరింగ్‌ పక్కాగా ఉండాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.

హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కిట్లు ఇస్తున్నామా లేదా అనే విషయంపై ప్రతీ ఒక్కరూ దృష్టిపెట్టాలని, కిట్లు రాలేదంటే ఖచ్చితంగా కలెక్టర్లు, జేసీలదే భాద్యత అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఏఎన్‌ఎంలు, లోకల్‌ డాక్లర్లు మ్యాపింగ్‌ చేయాలి, డాక్టర్‌ కూడా ఆ ఇంటికి వెళ్ళి చూడాలి, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం, పిహెచ్‌సీ డాక్టర్‌ ముగ్గురూ ఖచ్చితంగా వారితో మాట్లాడాలని సీఎం సూచించారు. కోవిడ్‌ భాదితులను ఎర్లీగా ఐడెంటీటీ చేయడం వల్లే మరణాల సంఖ్య తగ్గుతుందన్నారు.

ఈ కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి జగన్.. విపక్ష నేత చంద్రబాబుపైనా, కొన్ని మీడియా సంస్థలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ మనం చంద్రబాబు అనే వ్యక్తితో కాదు, నెగిటివ్‌ మైండ్‌సెట్‌తో ఉన్న ఎల్లో మీడియాతో కూడా యుద్దం చేస్తున్నాం.. మనం ఎంత మంచి చేస్తున్నా వేలెత్తి చూపే దుర్భుద్దితో పనిచేస్తున్నారు.. అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం.. నెగిటివ్‌ వార్తలు చదువుదాం, మనం కరెక్ట్‌ చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసుకుందాం.. వారు అతిగా రాసినవి కూడా ఎత్తిచూపుదాం ’’ అని సీఎం వ్యాఖ్యలు చేశారు.