Andhrapradesh: ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్  గుడ్ న్యూస్.. ఆ బకాయిల విడుదలకు గ్రీన్‌సిగ్నల్

|

Apr 17, 2021 | 2:18 PM

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్  గుడ్ న్యూస్ చెప్పింది.  వారి వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజన బకాయిలన్నీ చెల్లించాలని సంబంధిత

Andhrapradesh: ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్  గుడ్ న్యూస్.. ఆ బకాయిల విడుదలకు గ్రీన్‌సిగ్నల్
Cm Jagan
Follow us on

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్  గుడ్ న్యూస్ చెప్పింది.  వారి వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజన బకాయిలన్నీ చెల్లించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 2017–19 మధ్య కాలంలో రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు అప్పటి చంద్రబాబు సర్కారు వేతనాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించకుండా బకాయిపెట్టింది. ఆ మొత్తాలని చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులను గతంలోనే ఆదేశించారు. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు విడతల చెల్లింపులు జరిపిన ఆర్టీసీ అధికారులు చివరి రెండు విడతల బకాయిలను కూడా ఈ నెలాఖరు నాటికి చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు  ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  దాంతో నాలుగేళ్లుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

ఏపీఎస్ ఆర్టీసీ సేవలన్నీ ఒకే యాప్‌లో….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్‌ రిజర్వేషన్‌ ‌, బస్సు ఎక్కడుందో తెలుసుకునే ట్రాకింగ్‌కు ‌, పాస్‌లు పొందడానికి, కంప్లైంటుల కోసం వేర్వేరు వెబ్‌సైట్‌లు ఉండకుండా.. ఈ సేవలన్నింటినీ ఒకే వెబ్‌సైట్‌లో అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ (యూటీఎస్‌) విధానాన్ని ఏపీఎస్‌ ఆర్టీసీ అందుబాటులోకి తెస్తుంది. డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించేందుకుఈ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చాజెండా ఊపిన విషయం తెలిసిందే.

Also Read: ‘తండ్రి డబ్బును వేస్ట్ చేస్తున్నావ్’ అన్న నెటిజన్‌కు.. సారా టెండూల్కర్ సాలిడ్ కౌంటర్

ఆ ఇంటి ముందు డోర్ పంజాబ్‌లో తెరుచుకుంటే.. వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటుంది