వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు నెం.1- జగన్

|

Mar 23, 2019 | 5:08 PM

పాడేరు: ఎన్నికల ప్రచారంలో జగన్ జోరు చూపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరులో నిర్వహించిన బహిరంగసభలో జగన్‌ మాట్లాడారు. వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరంటూ ఎద్దేవా చేశారు.  ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేను కొనుగోలు చేయడంలో చంద్రబాబు నెంబర్‌వన్‌ అని ఇలాంటి వ్యక్తి సీఎంగా మనకు అవసరమా?.’’ అని వ్యాఖ్యానించారు. ధర్మారాజుకు ధర్మం చేయడమెలాగో ఆయనే నేర్పిన విధంగా అబద్ధాలు మాట్లాడుతారంటూ విమర్శలు చేశారు. […]

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు నెం.1- జగన్
Follow us on

పాడేరు: ఎన్నికల ప్రచారంలో జగన్ జోరు చూపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరులో నిర్వహించిన బహిరంగసభలో జగన్‌ మాట్లాడారు. వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరంటూ ఎద్దేవా చేశారు.  ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేను కొనుగోలు చేయడంలో చంద్రబాబు నెంబర్‌వన్‌ అని ఇలాంటి వ్యక్తి సీఎంగా మనకు అవసరమా?.’’ అని వ్యాఖ్యానించారు. ధర్మారాజుకు ధర్మం చేయడమెలాగో ఆయనే నేర్పిన విధంగా అబద్ధాలు మాట్లాడుతారంటూ విమర్శలు చేశారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని గత ఎన్నికల్లో హామి ఇచ్చిన టీడీపీ..మహిళలను మోసం చేసిందని జగన్ అన్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు ఆగాయంటే అది వైసీపీ  పోరాటాల ఫలమేనని చెప్పారు. మున్ముందు తవ్వకాలు జరగకుండా చూస్తామని  జగన్ హామీ ఇచ్చారు.  వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తానని చెప్పడంతో పాటు నవరత్నాల్లో ఉన్న ప్రతి హామి నెరవేరుస్తామని పేర్కొన్నారు.