Minister Viswarup: 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించిన మంత్రి.. రెండో సారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విశ్వరూప్‌

|

Apr 13, 2022 | 1:01 PM

Pinipe Viswarup: ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ సతీసమేతంగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు..

Minister Viswarup: 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించిన మంత్రి.. రెండో సారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విశ్వరూప్‌
Ap Minister Viswarup
Follow us on

Ap Minister Viswarup:  జగన్ మంత్రి వర్గంలో మరోసారి చోటు దక్కించుకున్న  ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు సారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రి సతీమణితో కలిసి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అయితే తన సహాయకులు ఉన్నా.. మొత్తం కొబ్బరికాయలను మంత్రే విశ్వరూపే కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి (CM YS Jagan) కేబినెట్‌లో రెండవ సారి తనకు అవకాశం కల్పించి రవాణా శాఖ బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రంగా అమలాపురంను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే అమలాపురంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఇంటిగ్రేటివ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కోనసీమలో ఉన్న చమురు, సహజవాయువు నిక్షేపాల ద్వారా వచ్చే సిఎస్ఆర్ నిధులు ద్వారా కోనసీమ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అలాగే నిన్న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిజీల్‌ ధర పెరగడంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని, ఉన్నతాధికారులతో సమీక్షించి లాభాల బాటలో నడిపిందుకు చర్యలు చేపడతానన్నారు. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి సంస్థకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారన్నారు. వాహన కాలుష్య నివారపై ప్రత్యేక దృష్టి సారించి దశల వారీగా విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Vidadala Rajini: ఆంధ్ర రాజకీయాల్లో తెలంగాణ ఆడబిడ్డ.. ఇప్పుడు మంత్రిగా పొలిటికల్ ట్రెండ్ సెట్టర్..

Ration: రేషన్ బదులు డబ్బులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి మాత్రం నో..