Andhra Pradesh: ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ..

Andhra Pradesh: కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్ ఇచ్చింది అధికార వైసీపీ పార్టీ.

Andhra Pradesh: ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ..
Mlc Anantha Babu

Updated on: May 25, 2022 | 6:46 PM

Andhra Pradesh: కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్ ఇచ్చింది అధికార వైసీపీ పార్టీ. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే. ఈ హత్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించింది. అయితే, హత్యారాజకీయాలకు తాము లేదని చెబుతూ.. అనంతబాబు విషయంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి అనంతబాబును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.

Follow Us