Mood of Survey: ఏపీలో మళ్లీ జగన్ ప్రభంజనమే.. మూడ్ ఆఫ్ సర్వేలో వైసీపీ హవా..

|

Aug 12, 2022 | 4:33 PM

Mood of Survey: ఏపీలో మళ్లీ వైఎస్ జగన్‌దే హవా కొనసాగనుంది. రాష్ట్ర ప్రజల నెంబర్ వన్ చాయిస్‌గా జగన్‌నే కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు.

Mood of Survey: ఏపీలో మళ్లీ జగన్ ప్రభంజనమే.. మూడ్ ఆఫ్ సర్వేలో వైసీపీ హవా..
Ycp Jagan
Follow us on

Mood of Survey: ఏపీలో మళ్లీ వైఎస్ జగన్‌దే హవా కొనసాగనుంది. రాష్ట్ర ప్రజల నెంబర్ వన్ చాయిస్‌గా జగన్‌నే కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఈ విషయాన్ని ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ జగనే ప్రభంజనం సృష్టిస్తారని ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో మరోసారి వైసీపీ విజయం నల్లేరుమీద నడకేనని తేల్చింది. తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఆగస్టు ఎడిషన్ సర్వే రిపోర్టును ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ సర్వే నిర్వహించగా.. చాలా వరకు ఓటర్లు జగన్‌కే ఓటేశారు. మొదటి ప్రాధాన్యతగా ముఖ్యమంత్రి జగన్‌నే ఎంచుకున్నారు.

ఈ సర్వే ప్రకారం.. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 సీట్లు దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 126 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక మిగతా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభావం చూపనున్నాయంది. ఏపీలో జనసేన ప్రభావం బాగానే ఉన్నప్పటికీ.. సీట్లు గెలుపొందే విషయంలో మునుపటి పరిస్థితే ఉండొచ్చని అంచనా వేసింది.

గత నెలలోనూ ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 స్థానాలు, టీడీపీకి 6 స్థానాలు లభిస్తాయని పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..