Andhra Pradesh: ఆ ఊర్లో చిచ్చు పెట్టిన రహదారి.. రోడ్డు మీదకొచ్చిన 45 కుటుంబాలు..

|

Jun 05, 2022 | 9:25 AM

Andhra Pradesh: ఆ కాలనీ ఏర్పడి పాతికేళ్లు దాటింది. సుమారు 45 కుటుంబాలు జీవిస్తున్నాయ్‌ అక్కడ. అయితే, ఇప్పుడు ఆ కాలనీకి ఊహించని సమస్య వచ్చింది.

Andhra Pradesh: ఆ ఊర్లో చిచ్చు పెట్టిన రహదారి.. రోడ్డు మీదకొచ్చిన 45 కుటుంబాలు..
Village
Follow us on

Andhra Pradesh: ఆ కాలనీ ఏర్పడి పాతికేళ్లు దాటింది. సుమారు 45 కుటుంబాలు జీవిస్తున్నాయ్‌ అక్కడ. అయితే, ఇప్పుడు ఆ కాలనీకి ఊహించని సమస్య వచ్చింది. ఆ సమస్య పెద్ద రచ్చకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకెళితే.. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామంలో ఉంది. ఈ కాలనీ ఏర్పడి పాతికేళ్లు దాటిపోయింది. ఇప్పటివరకు ఎలాంటి సమస్యా లేదు. అక్కడ జీవిస్తోన్న 45 కుటుంబాల జీవితాలు సాఫీగానే వెళ్లిపోయాయ్. పక్కా ఇళ్లు కూడా కట్టుకున్నారు. అంతా సవ్యంగానే సాగుతోన్న వాళ్ల జీవితాల్లోకి అనుకోనివిధంగా సమస్య వచ్చిపడింది. పాతికేళ్ల నుంచి గానుగపెంట గ్రామస్తులు తిరుగుతోన్న రహదారి.. తమదంటూ ఇనుప కంచె కట్టారు కొందరు. ఇది తమ భూమి అంటూ ఆ కాలనీ వాసులు బయటకు వెళ్లే దారి లేకుండా దిగ్బంధించారు. దాంతో, గానుగపెంట కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఏదైనా అవసరం వస్తే గ్రామంలోకి వెళ్లకుండా చేశారని వాపోతున్నారు. ఊర్లోకి అడుగుపెట్టాలంటే చుట్టూ తిరిగి, వాగు దాటుకుని, స్మశానం గూండా పోవాల్సి వస్తోందని అంటున్నారు.

అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు గానుగపెంట కాలనీ వాసులు. కేవలం రాజకీయ కక్షతోనే అధికార పార్టీ స్థానిక నేతలు తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. కాలనీ చుట్టూ ఇనుప కంచె వేయడంతో కనీసం మంచినీళ్లు కూడా తెచ్చుకోలేకపోతున్నామని అంటున్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గానుగపెంట కాలనీ వాసుల ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి, వాళ్లకు సంఘీభావం తెలిపారు. పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.