Vegetable Prices: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన కూరగాయల ధరలు.. ఇప్పుడు తక్కువ రేటుకే..

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు ధరలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. మొన్నటివరకు కిలో ఉల్లి రూ.80 వరకు పలకగా.. ఇప్పుడు రూ.50కి పడిపోయింది. దీంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. ఇక మిగతా కూరగాయల ధరలు కూడా దిగొస్తున్నాయి. పండుగ సీజన్ క్రమంలో ధరలు దిగిరావడం ఊరటగా చెప్పవచ్చు.

Vegetable Prices: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన కూరగాయల ధరలు.. ఇప్పుడు తక్కువ రేటుకే..
Vegetable Prices

Updated on: Oct 25, 2026 | 11:07 AM

పండుగ సీజన్ క్రమంలో సామాన్యులకు భారీ ఊరట కలిగింది. కూరగాయల ధరలు ఉన్నట్లుండి దిగొస్తున్నాయి. ఎల్‌నీవో పరిస్థితుల క్రమంలో వర్షాలు లేకపోవడంతో కూరగాయల దిగుబడి తగ్గింది. దీంతో ధరలు పుంజుకోగా.. ప్రస్తుతం సరఫరా మెరుగవ్వడంతో ధరలు కిందకు దిగుతున్నాయి. మరో కొద్ది రోజుల్లో దీపావళి పండుగ వచ్చేస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య  జరుపుకునే పండుగ ఇది. పండక్కి ఇంట్లో రకరకాల వంటకాలు చేస్తూ ఉంటారు. ఇలాటి తరుణంలో ధరలు పడిపోవడం సామాన్యులకు ఉపశమనం కలగించే అంశంగా చెప్పవచ్చు.  ఇవాళ 25వ తేదీ ఆదివారం రోజున తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

హైదరాబాద్‌లో కూరగాయల ధరలు..

కూకట్‌పల్లి రైతు బజార్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే.. కిలో టమాటా రూ.27, వంకాయ రూ.22, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.55, బొబ్బాయి మిర్చి రూ.45, కాకరకాయ రూ.35గా పలుకుతుండగా.. కేజీ బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.13, చిక్కుడు కాయలు రూ.45, క్యారెట్ రూ.45, కాలీఫ్లవర్ రూ.30, దొండకాయ రూ.20కు లభిస్తున్నాయి. ఇక పొలం చిక్కుడు రూ.45, గోరుచిక్కుడు రూ.35, బీట్‌రూట్ రూ.31, క్యాప్సికం రూ.60, బంగాళాదుంప రూ.20, లోకల్ కీరదోస రూ.18, ఇటాలియన్ కీరదోస రూ.28, దోసకాయ రూ.35, సొరకాయ రూ.20, పొట్లకాయ రూ.24, కందగడ్డ రూ.32, ఉల్లికాడలు రూ.55, ఉల్లిపాయలు రూ.40 పలుకుతున్నాయి. అలాగే పచ్చి మామిడికాయలు రూ.15–20, అరటికాయలు రూ.9–10, చామగడ్డ రూ.43, ముల్లంగి రూ.6–8 (ఒక్కటి), చిలగడదుంప రూ.40, గుమ్మడికాయ రూ.40, నిమ్మకాయలు రూ.50–60 (డజను), మునగకాయలు రూ.10–12 (ఒక్కటి), బొప్పాయి రూ.50, పుట్టగొడుగులు (200 గ్రాములు) రూ.45కు దొరుకుతున్నాయి. ఇక కిలో ఎండుమిర్చి రూ.280, పాత అల్లం రూ.180, కొత్త అల్లం రూ.120, వెల్లుల్లి రూ.260, చింతపండు రూ.160, ఎర్ర మిర్చి రూ.80, ఉసిరికాయలు రూ.80, కరివేపాకు రూ.60, పర్వల్ రూ.40, వేరుశనగలు రూ.60, లోబియా రూ.40, టీసెల్ గోర్డ్ రూ.100 పలుకుతున్నాయి.

విజయవాడలో ధరలు ఎలా ఉన్నాయంటే..?

విజయవాడలో కిలో టమాటా రూ.32, వంగ రూ.24, బెండ రూ.14, పచ్చిమిర్చి రూ.63, కాకర రూ.47, బీర రూ.45, క్యారెట్ రూ.42, క్యాబేజీ రూ.25, దొండ రూ.20, బంగాళదుంప రూ.25, ఉల్లిపాయలు రూ.35, గోచుచిక్కుళ్లు రూ.34, దోస రూ.34, పొట్లకాయ రూ.18, చామ రూ.32, బీట్ రూట్ రూ.36, కీర రూ.40, క్యాప్చికం రూ.70, అల్లం రూ.160, ఫ్రెంచి బీన్స్ రూ.75, సొర రూ.10 పలుకుతున్నాయని చెప్పవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us