26.6 లక్షల మందికి ఉగాది కానుకగా.. జగన్ ఇవ్వబోతున్నది ఇవే..!

| Edited By:

Mar 07, 2020 | 6:34 PM

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాబోయే ఉగాది కానుకగా.. 26.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుంది. ఈ సందర్భంగా.. ఏపీ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ భేటీఅయ్యారు. తాడేపల్లిలో నిర్వహించిన ఈ రివ్యూ మీటింగ్‌లో మంత్రి శ్రీరంగనాథరాజుతో పాటు.. ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాల కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుతం ఇస్తున్న ఇళ్ల పట్టాలు, పట్టణ, నగరాభివృద్ధి సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల […]

26.6 లక్షల మందికి ఉగాది కానుకగా.. జగన్ ఇవ్వబోతున్నది ఇవే..!
Follow us on

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాబోయే ఉగాది కానుకగా.. 26.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుంది. ఈ సందర్భంగా.. ఏపీ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ భేటీఅయ్యారు. తాడేపల్లిలో నిర్వహించిన ఈ రివ్యూ మీటింగ్‌లో మంత్రి శ్రీరంగనాథరాజుతో పాటు.. ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాల కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుతం ఇస్తున్న ఇళ్ల పట్టాలు, పట్టణ, నగరాభివృద్ధి సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలతో పాటు.. ఇతర పథకాల ద్వారా ఇప్పటివరకూ మంజూరైన ఇళ్ల వివరాలు.. ఇంకా రాష్ట్రానికి ఎన్ని మంజూరు అయ్యే అవకాశం ఉందన్న అంశాలపై వైఎస్ జగన్.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాబోయే ఉగాది రోజున 26.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 2024 నాటికి 30 లక్షల ఇళ్లను నిర్మించేందుకు కార్యచరణ చేస్తున్నామన్నారు. ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలంటూ సూచించిన సీఎం.. డిజైన్‌లో కొన్ని మార్పులు చేయాలని సూచించారు.

అంతేకాదు.. ప్రభుత్వం ఇచ్చే ఈ ఇళ్లపై పావలా వడ్డీకే.. రూన. ఇరవై ఐదు వేల వరకు రుణాలు ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. మిగతా వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.