AP Crime News: మరో పరువు హత్య! తక్కువ కులం వ్యక్తిని ప్రేమించిందని కన్న కూతురుని హతమార్చిన తండ్రి..

గత కొన్ని నెలలుగా అనంతపురం జిల్లాలో వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అటువంటి సంఘటన తాజాగా మరొకటి చోటుచేసుకుంది. కూతురు తక్కువ కులం వ్యక్తిని ప్రేమించిందనే నెపంతో..

AP Crime News: మరో పరువు హత్య! తక్కువ కులం వ్యక్తిని ప్రేమించిందని కన్న కూతురుని హతమార్చిన తండ్రి..
Paruvu Hatya

Updated on: Sep 10, 2022 | 8:29 AM

Anantapur paruvu hatya News: గత కొన్ని నెలలుగా అనంతపురం జిల్లాలో వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అటువంటి సంఘటన తాజాగా మరొకటి చోటుచేసుకుంది. కూతురు తక్కువ కులం వ్యక్తిని ప్రేమించిందనే నెపంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని కర్కశంగా హతమార్చాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చర్లోపల్లికి చెందిన 18 ఏళ్ల కూతురిని తండ్రి గుర్రప్ప హత్య చేశాడు. వేరే కులం వ్యక్తిని ప్రేమించడం వల్లే కూతురికి చంపేశాడని పోలీసులు భావిస్తున్నారు. కూతురిని హత్య చేసిన తండ్రి గుర్రప్ప పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కూతురు గర్భం దాల్చడం వల్లే హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే స్థానికులు మాత్రం ఇది పరువు హత్య కాదని చెబుతున్నారు. భార్యాభర్తల గొడవలో కూతురు తలదూర్చడంతో ప్రమాదవశాత్తు కిందపడిపోయిందని చెబుతున్నారు. తలకు గాయం కావడంతో మృతి చెందిందని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.