వాటి విలువ రూ.1.49 కోట్లు మాత్రమే.. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రకటన..

| Edited By: Pardhasaradhi Peri

Jun 11, 2020 | 7:51 PM

టీడీపీ హయాంలో వేసవి కాలంలో వచ్చిన పలు పండుగల సందర్భంగా భక్తుల కోసం మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేసిన సంగతి తెలిసిందే.

వాటి విలువ రూ.1.49 కోట్లు మాత్రమే.. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రకటన..
Follow us on

టీడీపీ హయాంలో వేసవి కాలంలో వచ్చిన పలు పండుగల సందర్భంగా భక్తుల కోసం మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్యాకెట్ల సరఫరాపై ప్రస్తుతం పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 2015-16 నుంచి 2019-20 వరకు దేవాలయ్యాల్లో హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశామని తెలిపారు. వీటి విలువ రూ. 1.49 కోట్లు మాత్రమేనని ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్‌ ద్వారా ఏడాదికి రూ.40.0 కోట్ల విలువగల మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేశారన్నది పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ పిలిచిన టెండర్ల ప్రకారమే.. తాము ముందుకు వెళ్లామని.. బ్రహ్మోత్సవం, శ్రీ రామనవమి, వైకుంఠ ఏకాదశి లాంటి పండుగలకు మాత్రమే మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశామని హెరిటేజ్ ఫుడ్స్‌ ప్రకటించింది. హెరిటేజ్ ఫుడ్స్‌ పారదర్శకంగా, విలువలతో కూడిన వ్యాపారం చేస్తుందని సంస్థ తెలిపింది.