Cheat With Fake Frofile: అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి బురిడీ కొట్టించాడు.. ఏకంగా 21 లక్షలు దోచేశాడు..

|

Jan 02, 2021 | 8:41 AM

Cheat With Fake Frofile: అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసిన దంపతులు ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.21లక్షలను దోచేశారు.

Cheat With Fake Frofile: అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి బురిడీ కొట్టించాడు.. ఏకంగా 21 లక్షలు దోచేశాడు..
Follow us on

అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసిన దంపతులు ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.21లక్షలను దోచేశారు. అనంతరం పోలీసులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన కంపా హృదయానంద్‌, అనూష అలియాస్‌ హారిక దంపతులు. హారిక అంతకుముందు మరో వ్యక్తిని పెళ్లిచేసుకుని విడాకులు తీసుకుంది. అనంతరం హృదయానంద్‌‌ను పెళ్లి చేసుకుంది. అయితే భర్త అనారోగ్యం పాలవడంతో ఏ పనీ చేయలేకపోయాడు. దీంతో హారిక హైదరాబాద్‌లోని ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో ఉద్యోగంలో చేరింది. చాలీచాలని సంపాదనతో సంతృప్తి చెందక ఈ దంపతులు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడ్డారు.

మొదట హారికా హృదయానంద్‌ పేరిట ఓ ఫేక్‌ ప్రొఫైల్‌ తయారుచేసి అందమైన యువతి ఫొటోతో ఇండియన్‌ డేటింగ్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌లో పోస్టు చేశారు. నేరెడ్‌మెట్‌కు చెందిన డోనాల్డ్‌ హోరసీస్‌ రోజారియో అనే వ్యక్తి చాటింగ్‌ మొదలెట్టాడు. హృదయానంద్‌ తాను యువతినని భ్రమింపజేస్తూ చాటింగ్‌ చేశాడు. చివరకు గుండె జబ్బుతో బాధపడుతున్న తన తల్లి శస్త్రచికిత్సకు ఆర్థికసాయం కావాలంటూ కోరాడు. అతను ఆన్‌లైన్‌లో డబ్బు పంపాడు. మరికొన్ని రోజుల తర్వాత తల్లి మరణించిందని పలుమార్లు డబ్బు అడిగాడు. అమ్మాయి ఇబ్బందుల్లో ఉందనుకొని పలు దఫాలుగా డోనాల్డ్‌ రూ.21లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించాడు. ఆ తర్వాత కూడా పెళ్లి గురించి అడిగే సరికి వాయిదా వేస్తూ రావడంతో అతడికి అనుమానం వచ్చింది. దీంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విజయవాడకు వెళ్లి నిందితులను పట్టి తెచ్చారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.