Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స..

|

Nov 28, 2021 | 8:50 AM

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అస్వస్థతకు  గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు ఛాతి నొప్పితో రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స..
Rk
Follow us on

Mangalagiri MLA Alla Ramakrishna Reddy: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం చికిత్స కోసం అక్కడే ఉండాలని సూచించారు. దీంతో ఆర్కే ఆస్పత్రిలో చేరిపోయారు. అయితే.. ఆర్కే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆర్కే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మంగళగిరిలో జరుగుతున్న అనేక అభివృద్ది కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ బిజీగా ఉంటున్నారు.

ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శనివారం మంగళగిరి – తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం నరసింహ స్వామి ఆలయంలో జరిగిన పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. సాయంత్రం పెదకాకానిలోని తన నివాసానికి బయలుదేరిన ఎమ్మెల్యే ఆర్కేకు స్వల్పంగా ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. ఆర్కే కోలుకుంటుండటంతో పార్టీ కార్యకర్తలతోపాటు నియోజక వర్గ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి.. చాణక్యనీతిలో సంచలన విషయాలు..

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే తెలుసా.. ఇది ఎక్కడ ప్రారంభమైంది.. భారతదేశంలో ఎప్పుడు వచ్చింది..