
కూటమికి మొన్న పట్నవాసం ఇప్పుడు పల్లె వెలుగు. దివాలీ సీజన్‌లో బ్యాక్‌టుబ్యాక్ రెండు ధమాకాల్ని ఎంజాయ్ చేస్తోంది. అపోజిషన్ మాత్రం దింపుడు కళ్లెం ఆశలు కూడా వదులుకుని, ఉస్సూరుమంటోంది. ఏదైతేనేం స్థానికఎన్నికల ఫలితం మీద మొన్నటిదాకా ఫికర్ పెట్టుకుని టెంపరేచర్లు పెంచుకున్న పార్టీలు.. ఇప్పుడైతే ఊపిరి పీల్చుకుంటున్నాయి. కానీ, పిక్చర్ పర్‌ఫెక్టేనా అంటే అదీ కాదు. మూడ్ ఆఫ్ ది ఏపీ ఏమంటోంది? జనం నాడిని పసిగట్టడంలో ఏ పార్టీ ఎంత మేరకు పెర్ఫామ్ చెయ్యగలిగింది? ఇవన్నీ తేలాల్సిన ప్రశ్నలు. సో, లోకల్ పిక్చర్ అభీ బాకీ హై అన్నమాట. పల్నాడు జిల్లా నకిరకల్లు జెడ్‌పీటీసీ 33 వేల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం సొంతం చేసుకుంది. ఇదే పల్నాడు జిల్లా పెదకూరపాడు సెగ్మెంట్ క్రోసూరు జెడ్‌పీటీసీ.. 30 వేల ఓట్ల లీడ్‌తో జనసేన వశమైంది. 40వేలకు మించి ఓట్లు లేని జెడ్‌పీటీసీల్లో 30 వేలకు పైగా మెజారిటీ అంటే, తీర్పు పూర్తి ఏకపక్షంగా వచ్చినట్టే లెక్క. మొన్న పులివెందుల మున్సిపాలిటీలో పాగా వేసిన తెలుగుదేశం, ఇప్పుడు పులివెందుల జెడ్‌పీటీసీని కూడా సొంతం చేసుకుని.. వైఎస్ ఫ్యామిలీ అడ్డాలో పాగా వేసింది. ఇలా వైసీపీ కంచుకోటలన్నీ బద్దలు చేసి పరిషత్ ఎన్నికల్లో దూసుకెళ్తోంది కూటమి. కొన్నిచోట్ల మూడు,...