కర్నూలులో కప్పల వర్షం..

| Edited By:

Jun 25, 2019 | 7:26 AM

వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూశాం కానీ.. ‘కప్పల వర్షం’ పడే దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా..? కర్నూలు జిల్లాలో అలాంటి దృశ్యమే కనిపించింది. 10 కాదు.. 20 కాదు.. ఏకంగా వందల సంఖ్యలో కప్పలు ఏకధాటిగా ఆకాశం నుంచి మీదపడ్డాయి. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కర్నూలు జిల్లా రుద్రవరం ముకుందాపురం గ్రామంలో తెల్లవారు జామున కురిసిన తేలికపాటి వర్షంలో కప్పలు కూడా భారీగా వచ్చి చేరాయి. నారుమడి కోసం తయారు చేసిన పొలంలో […]

కర్నూలులో కప్పల వర్షం..
Follow us on

వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూశాం కానీ.. ‘కప్పల వర్షం’ పడే దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా..? కర్నూలు జిల్లాలో అలాంటి దృశ్యమే కనిపించింది. 10 కాదు.. 20 కాదు.. ఏకంగా వందల సంఖ్యలో కప్పలు ఏకధాటిగా ఆకాశం నుంచి మీదపడ్డాయి. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

కర్నూలు జిల్లా రుద్రవరం ముకుందాపురం గ్రామంలో తెల్లవారు జామున కురిసిన తేలికపాటి వర్షంలో కప్పలు కూడా భారీగా వచ్చి చేరాయి. నారుమడి కోసం తయారు చేసిన పొలంలో ఎక్కడ చూసినా పసుపు రంగులో ఉన్న కప్పలు ఎగురుతూ కనిపించడంతో అక్కడవున్న రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా.. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతుండటంతో పొలం పనులకు రెడీ అవుతున్నారు రైతులు.