Kakinada District: నెత్తురు మరిగిన వింత జంతువు మిస్టరీ వీడింది.. సీసీ కెమెరాలకు మృగం చిక్కింది..

|

May 28, 2022 | 9:35 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వింత జంతువు కలకలం రేపుతోంది. పశువులపై దాడి చేస్తూ రైతులను బెంబేలెత్తిస్తోంది. తాజాగా ఆ జంతువు కనిపెట్టారు అధికారులు.

Kakinada District: నెత్తురు మరిగిన వింత జంతువు మిస్టరీ వీడింది.. సీసీ కెమెరాలకు మృగం చిక్కింది..
Ap News
Follow us on

AP News: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం(Prathipadu  constituency)లో వింత జంతువు సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే . గొల్లప్రోలు మండలం(Gollaprolu mandal) కొడవలి-పోతులూరు గ్రామంలో పులి సంచరిస్తుందని..రాత్రిపూట ఎవ్వరూ బయటకు రావొద్దని గ్రామ సర్పంచ్‌ సెల్ఫీ వీడియోతో ప్రచారం నిర్వహించారు. అయితే అది పెద్దపులియా..? లేక వింత జంతువా ? అన్న విషయంపై అధికారులకు కూడా తొలుత స్పష్టత రాలేదు. దీంతో ఏలేశ్వరం అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను సేకరించారు. గత కొన్ని రోజులుగా ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి,శరభవరం గ్రామాల్లో కొండలపై మేతకు వెళ్లిన పశువులు కూడా మాయమవుతున్నాయి. చుట్టుపక్కల గాలించడంతో ఒమ్మంగి సరుగుడితోటల్లో రెండు గేదెల కళేబారాలు లభ్యమయ్యాయి. పశువులను చంపిన మృగం కోసం ఫారెస్టు సిబ్బంది టెక్నాలజీ ఉపయోగించారు. అడవిలోని పలు ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు.  ఈ క్రమంలో అధికారుల అంచనాలే నిజయమ్యాయి.  ఆ ప్రాంతంలో సంచరించిన జంతువు పెద్ద పులి అని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు అధికారులకు పులి విజువల్స్ చిక్కాయి. ఇప్పటివరకు 6 పశువులను హతమార్చింది ఈ పులి. నాలుగు పశువులకు గాయాలయ్యాయి. కాగా తమ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది అని తెలియడంతో… సమీప పది గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్పారు. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని.. త్వరలోనే ఆ పులిని బంధిస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి