వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..!

ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రట్టు చేశారు. విజయవాడ శివార్లలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన విదేశీ బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్మగ్లింగ్‌కు సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు.

వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..!
Foreign Gold Smuggling Racket

Updated on: Oct 21, 2026 | 12:07 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రట్టు చేశారు. విజయవాడ శివార్లలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన విదేశీ బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్మగ్లింగ్‌కు సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు.

బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన DRI అధికారులు విజయవాడ శివార్లలో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న స్కార్పియో వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా, రహస్య అరలో దాచిన విదేశీ కరెన్సీని గుర్తించారు. అందులో 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును ఈ కరెన్సీ రూపంలో తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

మరోవైపు హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు బంగారం క్యారియర్లను అధికారులు గుర్తించారు. టోల్‌ప్లాజా వద్ద వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, నడుముకు కట్టుకున్న పౌచ్‌లలో దాచిన మూడు బంగారు బిస్కెట్లు లభించాయి. వీటి బరువు సుమారు 3.1 కిలోలుగా గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి, బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, అక్రమ రవాణా మార్గాలపై DRI అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us