Heavy Rains: ప్ర‌కాశం బ్యారేజీకి భారీగా వ‌చ్చి చేరుతోన్న వ‌ర‌ద‌ నీరు

| Edited By:

Aug 14, 2020 | 4:15 PM

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో గ‌త కొద్ది రోజుల నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ భారీ వ‌ర్షాల‌తో ప్ర‌కాశం బ్యారేజీకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో 70 గేట్లు అడుగు మేర ఎత్తివేశారు అధికారులు. ఇక ప్ర‌కాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 70 వేల క్యూసెక్కులు రాగా..

Heavy Rains: ప్ర‌కాశం బ్యారేజీకి భారీగా వ‌చ్చి చేరుతోన్న వ‌ర‌ద‌ నీరు
Follow us on

Heavy Rains: ఆంధ్ర ప్ర‌దేశ్‌లో గ‌త కొద్ది రోజుల నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ భారీ వ‌ర్షాల‌తో ప్ర‌కాశం బ్యారేజీకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో 70 గేట్లు అడుగు మేర ఎత్తివేశారు అధికారులు. ఇక ప్ర‌కాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 70 వేల క్యూసెక్కులు రాగా, ఔట్ ఫ్లో 50,750 క్యూసెక్కులు నీటిని అధికారులు వ‌దిలారు. తాగు సాగు నీరు కోసం 10,800 క్యూసెక్కులు ఈస్ట్ కెనాల్‌, వెస్ట్ కెనాల్ ద్వారా విడుద‌ల చేశారు. రెండు రోజ‌ల పాటు ఈ వ‌ర‌ద ప్ర‌వాహం ఉంటుంద‌ని అధికారులు అంటున్నారు. దిగువ ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అల్ప‌పీడ‌నం కార‌ణంగా ప‌శ్చిమ దిశ ఉంచి 45-55 కిలీ మీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. 48 గంట‌ల పాటు స‌ముంద్రంలోకి వెళ్ల‌వ‌ద్ద‌ని మ‌త్స్య‌కారుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు అధికారులు. ఇక ఇప్ప‌టికే కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా వేలేరు పాడులో 4 సె.మీ, విజ‌య‌వాడ‌, వీఆర్ పురం, కున‌వారంలో రెండు సెంటీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదయిన‌ట్లు అధికారులు తెలిపారు.

Read More:

ఈ నెల 19న ఆంధ్రప్ర‌దేశ్‌ కేబినెట్ స‌మావేశం

రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రేమ‌నంతా త‌న‌పై కురిపించుః నాగ‌బాబు