తిరుపతిలో ఫ్లెక్సీ వివాదం… నిషేధం ఉన్నా ఏర్పాటు… సీఎం జగన్, చీఫ్ విప్ ఫోటోలతో ఫ్లెక్సీ…

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటుపై నిషేధం ఉంది. ఈ నిషేధం చాలా కాలంగా కొనసాగుతోంది.

తిరుపతిలో ఫ్లెక్సీ వివాదం... నిషేధం ఉన్నా ఏర్పాటు... సీఎం జగన్, చీఫ్ విప్ ఫోటోలతో ఫ్లెక్సీ...

Updated on: Dec 11, 2020 | 10:48 AM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటుపై నిషేధం ఉంది. ఈ నిషేధం చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై చర్చ సాగుతోంది.

 

అసలు ఏం జరిగిందంటే… తిరుపతిలోని వైకుంఠాపురంలో ఓ హోటల్‌ను కొల్లం గంగిరెడ్డి ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి జగన్, చీఫ్ విప్ చెవిరెడ్డి ఫోటోలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన గంగిరెడ్డి ఎర్రచందనం స్మగర్ల్ అనే ఆరోపణలున్నాయి. గతంలో అతడు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జైలుకు సైతం వెళ్లాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us