చిత్తూరు జిల్లాలో నీవా నదిలో చిక్కుకుపోయిన రైతు.. సాహోసేపేతంగా కాపాడిన ఫైర్ సిబ్బంది

| Edited By:

Nov 28, 2020 | 12:19 PM

నివర్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

చిత్తూరు జిల్లాలో నీవా నదిలో చిక్కుకుపోయిన రైతు.. సాహోసేపేతంగా కాపాడిన ఫైర్ సిబ్బంది
Follow us on

Farmer rescued Chittoor: నివర్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలయమం అయ్యాయి. వాగులు నిండి నీళ్లు రోడ్లపై ప్రవహించాయి. ఇక అటు పలు రిజర్వాయర్లలో నీటి మట్టం పెరగడంతో.. గేట్లను ఎత్తివేశారు. కాగా పలుచోట్ల వరదల్లో చిక్కుకున్న చాలా మందిని ఫైర్‌ సిబ్బంది, ఎన్టీఆర్‌ఎఫ్‌ బలగాలు కాపాడారు. తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కుట్ర కోనలో నీవా నదిలో చిక్కుకున్న దొరస్వామి నాయకర్ అనే రైతును ఫైర్ సిబ్బంది సాహోసేపేతంగా కాపాడారు. (దూసుకొస్తోన్న ‘బూర్జ్‌ ఖలీఫా’ సైజ్‌ ఆస్ట్రాయిడ్‌.. నాసా శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే)

నదికి అవతలి పక్కన ఉన్న పొలానికి వెళ్తుండగా.. ఎన్టీఆర్ జలాశయం గేట్లు ఎత్తేడంతో ఆ వరద నీటిలో నాయగర్ చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది.. సాహోసేతంగా నదిలోకి వెళ్లి దొరస్వామిని కాపాడారు. జలాశయం గేట్లు మూసి ఫైర్ సిబ్బంది వృద్ధుడిని కాపాడారు. (ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కానీ జీవితంలో ముందుకు సాగాలి.. నెటిజన్ ప్రశ్నకు రేణు సమాధానం)