చిత్తూరు కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం, అనుమానాలు

| Edited By:

Apr 11, 2019 | 7:33 AM

చిత్తూరు కలెక్టరేట్‌లో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వివేకానంద భవన్‌లోని రెండో అంతస్తులో షార్ట్ సర్కూట్ అవ్వడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ సహా 11 ల్యాప్‌టాప్‌లు మంటల్లో కాలిపోయాయి. అలాగే కొన్ని కీలక డాక్యుమెంట్లు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కాగా పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు ఆ […]

చిత్తూరు కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం, అనుమానాలు
Follow us on

చిత్తూరు కలెక్టరేట్‌లో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వివేకానంద భవన్‌లోని రెండో అంతస్తులో షార్ట్ సర్కూట్ అవ్వడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ సహా 11 ల్యాప్‌టాప్‌లు మంటల్లో కాలిపోయాయి. అలాగే కొన్ని కీలక డాక్యుమెంట్లు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

కాగా పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు ఆ అంతస్తులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారుల సౌకర్యం కోసం పది వరకు ఏసీలు, 30కి పైనే ఫ్యాన్లు, ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచారు. మంటలు చెలరేగడంతో అవన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ హాలులోనే ప్రమాదం సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది.