వుమెన్స్ డే.. ఆ రైలులో అంతా మేమే!

| Edited By:

Mar 07, 2020 | 6:04 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని విజయవాడ రైల్వే డివిజన్‌లో మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కృష్ణా ఎక్స్ ప్రెస్ ఇంజన్ డ్రైవింగ్ నుండి టీసీ వరకు..

వుమెన్స్ డే.. ఆ రైలులో అంతా మేమే!
Follow us on

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని విజయవాడ రైల్వే డివిజన్‌లో మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కృష్ణా ఎక్స్ ప్రెస్ ఇంజన్ డ్రైవింగ్ నుండి టీసీ వరకు మహిళలతో ప్రత్యేక డ్రైవ్ కండక్ట్ చేశారు అధికారులు. ప్రతీ బోగీలో మహిళా పోలీసులతో పర్యవేక్షిస్తున్నారు. తొలి సారిగా మహిళా సిబ్బందితో ప్రయాణిస్తున్న కృష్ణా ఎక్స్ ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు మహిళా స్టేషన్ మాస్టర్. మహిళా సిబ్బందిగా రైల్వేలో, అందులోనూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఓకే రైలులో విధులు నిర్వహించటం గర్వంగా ఉందని అంటున్నారు మహిళా ఉద్యోగులు.