Watch: అయ్యో.. కర్షకనేస్తం వదిలెల్లిపోయిందే.. తల్లడిల్లిన దంపతులు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..

|

Aug 15, 2024 | 11:49 AM

కర్షక నేస్తాలు.. వృషభ రాజులు.. నిత్యం తమతోనే ఉండేవి.. వాటిని పిలిస్తే చాలు.. ఒక్క దౌడుతో పరిగెత్తుకుంటూ వచ్చేవి.. నిత్యం వ్యవసాయంలో సాయం చేసేవి.. విత్తనం విత్తిన మొదలు.. పంట ఇంటికి వచ్చే వరకు అడుగడుగునా తోడుండేవి.. ఆ ఎద్దులను దంపతులు సొంత బిడ్డల్లా చూసుకునేవారు.. కానీ.. అకస్మాత్తుగా

Watch: అయ్యో.. కర్షకనేస్తం వదిలెల్లిపోయిందే.. తల్లడిల్లిన దంపతులు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..
Bull Died
Follow us on

కర్షక నేస్తాలు.. వృషభ రాజులు.. నిత్యం తమతోనే ఉండేవి.. వాటిని పిలిస్తే చాలు.. ఒక్క దౌడుతో పరిగెత్తుకుంటూ వచ్చేవి.. నిత్యం వ్యవసాయంలో సాయం చేసేవి.. విత్తనం విత్తిన మొదలు.. పంట ఇంటికి వచ్చే వరకు అడుగడుగునా తోడుండేవి.. ఆ ఎద్దులను దంపతులు సొంత బిడ్డల్లా చూసుకునేవారు.. కానీ.. అకస్మాత్తుగా ఓ ప్రళయం వచ్చినట్లయింది.. వృషభ నేస్తాల్లో ఒకటి మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్న ఓ రైతు.. ఎద్దుల బండిపై బస్తాలతో వస్తుండగా.. ఉన్నట్టుండి ఎద్దులు బెదిరిపోయాయి. అవి.. వెంటనే బండితో సహా పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లాయి. అయితే రైతు ఈదుకుని ఒడ్డుకు చేరుకున్నాడు.. ఈ క్రమంలో ఓ ఎద్దుకు పట్టెడ తెగడంతో అది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసింది. కానీ మరో ఎద్దు మాత్రం బండితో సహా మునిగిపోయి.. చనిపోయింది.. ఈ విషాద ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగింది. కన్న బిడ్డలా చూసుకున్న ఎద్దు చనిపోవడంతో ఆ రైతు దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు. అక్కడున్న వారు కూడా వారిని చూసి కంటతడి పెట్టారు..

దువ్వూరు ఎస్సీ కాలనీకి చెందిన రైతు ఆశీర్వాదం వరి బస్తాలను ఎడ్లబండిపై తీసుకెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.. ఎద్దు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం చూసి రైతు దంపతులిద్దరూ కన్నీరుమున్నీరయ్యారు..

వీడియో చూడండి..

కాగా.. సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని .. ట్రాక్టర్ క్రేన్‌ సాయంతో ఎద్దు కళేబరాన్ని బయటకు తీశారు. అనంతరం దానికి అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..