తూర్పు గోదావరి జిల్లాలో కలకలం.. పీఎస్‌ ముందు ఆత్మహత్య చేసుకుంటామంటూ కుటుంబం నిరసన

|

Jan 23, 2021 | 1:54 PM

తూర్పు గోదావరి జిల్లా ముమ్ముడివరం కాట్రేనికోన పోలీసు స్టేషన్‌ ముందు ఒక కుటుంబం ఆందోళనకు దిగింది.  ఎస్ఐ తమను అన్యాయంగా దుర్బాషలాడుతూ తీవ్రంగా కొట్టాడని పెట్రోలు పోసుకుని...

తూర్పు గోదావరి జిల్లాలో కలకలం.. పీఎస్‌ ముందు ఆత్మహత్య చేసుకుంటామంటూ కుటుంబం నిరసన
Follow us on

తూర్పు గోదావరి జిల్లా ముమ్ముడివరం కాట్రేనికోన పోలీసు స్టేషన్‌ ముందు ఒక కుటుంబం ఆందోళనకు దిగింది.  ఎస్ఐ తమను అన్యాయంగా దుర్బాషలాడుతూ తీవ్రంగా కొట్టాడని పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను అన్యాయంగా వేధిస్తున్నారంటూ మల్లాడి నాగభూషణం తన కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగారు.

స్థల సరిహద్దు విషయంలో ఒక వర్గానికే ఎస్సై కొమ్ముకాస్తున్నారన్నది వారి ఆరోపణ. కాగా ఒకానొక సమయంలో  స్టేషన్ బయట పెట్రోల్ పోసుకుని కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు చేసుకునేందుకు ప్రయత్నించడంలో కలకం చెలరేగింది. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై పోలీపులు ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

Also Read:

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన యజమాని.. వారం రోజులపాటు అక్కడే నిరీక్షించిన పెంపుడు శునకం

కిస్తీ కట్టాలంటూ ఫైనాన్స్‌ కంపెనీ వరుస ఫోన్ కాల్స్.. టార్చర్ తట్టుకోలేక ఆటోని తగలబెట్టిన వ్యక్తి