Andhra Pradesh: పుట్టగొడుగుల కూర లొట్టలేసుకుని తిన్నారు.. ఆ తరువాతే మొదలైంది అసలు కథ..!

| Edited By: Balaraju Goud

Jul 12, 2024 | 3:02 PM

ఎంతో ఇష్టంతో అడవిలో దొరికిన పుట్టగొడుగులను తీసుకొచ్చాడు ఇంటిపెద్ద. కాఫీ తోటల్లో పనులు ముగించుకుని వస్తుండగా, పుట్టగొడుగులు కనిపించాయి. వాటిని సేకరించి ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి తీసుకువచ్చి కూర వండుకొని కుటుంబమంతా కలిసి తిన్నారు. ఒక్కొక్కరుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు.

Andhra Pradesh: పుట్టగొడుగుల కూర లొట్టలేసుకుని తిన్నారు.. ఆ తరువాతే మొదలైంది అసలు కథ..!
Mushrooms
Follow us on

ఎంతో ఇష్టంతో అడవిలో దొరికిన పుట్టగొడుగులను తీసుకొచ్చాడు ఇంటిపెద్ద. కాఫీ తోటల్లో పనులు ముగించుకుని వస్తుండగా, పుట్టగొడుగులు కనిపించాయి. వాటిని సేకరించి ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి తీసుకువచ్చి కూర వండుకొని కుటుంబమంతా కలిసి తిన్నారు. ఒక్కొక్కరుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు.

అల్లూరి జిల్లా ఏజెన్సిలో పుట్టగొడుగులు కూర ఓ కుటుంబాన్ని ఆసుపత్రి పాలు చేసింది. జీకే వీధీ మండలం సిరిబాల గ్రామానికి చెందిన అచ్యుత్, కాఫీ తోటలో కూలీ పనికి వెళ్ళాడు. సాయంత్రం పని ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరాడు. దారిలో పుట్టగొడుగులు కనిపించాయి. పుట్టగొడుగులను ఆనందంతో సేకరించి ఇంటికి తీసుకొచ్చాడు. వాటిని కూర వండుకుని కుటుంబ సభ్యులంతా కలిసి భోంచేశారు. తిన్న పది నిమిషాల వ్యవధిలోనే వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

అస్వస్థతకు గురైన వారిలో అచ్యుత్, సుమిత్ర, శేషాద్రి, పెద్ద లక్ష్మి, రాజేంద్రప్రసాద్ ఉన్నారు. వారందరిని హుటాహుటిన ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అక్కడ నుంచి చింతపల్లి CHC కు తరలించారు. చింతపల్లి ఆసుపత్రిలో ఆరోగ్యం కుదట పడకపోవడంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కుటుంబసభ్యులందరికి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వారిలో.. రాజేంద్ర ప్రసాద్ ను డిశ్చార్జ్ చేశారు. మిగిలిన నలుగురు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..