Janasena: జనసేన సైనికులే టార్గెట్.. గంటలో రూ. 2 లక్షల వరకూ లోన్ అంటారు.. నమ్మారో ఇక మటాషే!

|

Dec 07, 2022 | 12:10 PM

Janasena Party: జనసేనకు సంబంధించిన పార్టీ గ్రూప్ లలో జాయిన్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ లింకు ద్వారా జాయిన్ కండి. అంటూ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత లింక్..

Janasena: జనసేన సైనికులే టార్గెట్.. గంటలో రూ. 2 లక్షల వరకూ లోన్ అంటారు.. నమ్మారో ఇక మటాషే!
Janasena Party
Follow us on

జనసేన, PSPK, PSPK DIE HARD FANS,TARGET-2024 AP CM PS PK వంటి జనసేనకు సంబంధించిన పార్టీ గ్రూప్ లలో జాయిన్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ లింకు ద్వారా జాయిన్ కండి. అంటూ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత లింక్ ద్వారా జాయినైన వారికి గంటలో మీకు లోన్ ఇప్పిస్తామంటారు. రాజమండ్రివారి రాఘవేంద్ర ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా ఈ మెసేజ్ వస్తుంది.. లోన్ కావాలనుకున్నవారు తమకు మెసేజ్ పెట్టాలనీ.. లేదంటే కాల్ చేయమంటూ.. గ్రూప్ లో పోస్టింగులు కనిపిస్తాయ్. ఈ మెసేజ్ చూసి టెంప్ట్ అయితే ఇక అంతే సంగతులు.

పవన్ కళ్యాణ్ అభిమానులైతే.. చాలు వారికి వ్యక్తిగతంతా తాను లోన్ ఇప్పిస్తాననీ.. గ్రూపుల్లో మెసేజీలు పెడుతున్నాడో మాయగాడు. ఇది నిజమేనని నమ్మిన వారికి మొదట అభయహస్తం ఇచ్చేస్తాడు. తన జేబు నుంచి ధారాళంగా డబ్బు పంచుతున్నట్టు కలరింగ్ ఇస్తాడు. ఇదంతా నిజమేనని నమ్మిన వారు లోన్ కావాలని కాల్ చేస్తారు.. మొదట పాన్ కార్డ్ వాట్సప్ మెసేజ్ పెట్టమని అంటాడు. తర్వాత మీకు రెండు లక్షల వరకూ లోన్ వస్తుందని చెబుతాడు. మా లోను ఏమైందని అడిగితే.. ప్రాసెస్ లో ఉందని అంటాడు. ప్రాసెసింగ్ ఫీ 3800 రూపాయలు పంపమంటాడు. కట్టాక కూడా కొన్ని మాయమాటలు చెబుతాడు. ఇంకొంత డబ్బు దండుకుంటాడు. తీరా అకౌంట్ లోకి డబ్బు రాలేదేంటని అడిగితే.. ఫైనల్ గా ఏం చేస్కుంటారో చేస్కోమంటూ గ్రూపు నుంచి తీసేస్తాడు. ఇదీ ప్రస్తుతం జనసేన పార్టీ అభిమానుల- టార్గెట్ గా ఓ కంత్రీగాడి నిర్వాకం. ఇప్పటి వరకూ ఇలాంటి వారెందరో మోస పోయారు. వీరి ఆవేదన పార్టీ హెడ్డాఫీస్ కి చేరడంతో.. పార్టీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేయడంతో.. ఈ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

వాట్సప్ గ్రూపుల ద్వారా.. ఈ మోసం ఎంత ఆర్గనైజ్డ్ గా జరుగుతుందంటే.. ఒకరు గ్రూప్ అడ్మిన్ గా ఉంటారు. అందులోనే కొందరు.. సపోర్టర్స్ గా ఉన్నట్టు కనిపిస్తారు. వీరిలో కొందరు తమకు ఇప్పుడే డబ్బు పడ్డట్టు.. స్క్రీన్ షాట్స్ తీసి పెడతారు. దీంతో పాటు థాంక్స్ అన్నా.. నువ్వు సూపర్ అన్నా.. నాకు లోన్ ఇచ్చి ఆదుకున్నావంటూ.. వరుస మెసేజీలు. ఇవన్నీ చూసి.. గ్రూప్ లోని మిగిలిన వాళ్లు కూడా లోన్ కోసం అడిగితే.. పర్సనల్ గా మెసేజ్ చేయమంటాడు. మొదట డాక్యుమెంట్ల లిస్టు పెడతాడు. తర్వాత ఏ పేపర్లున్నా లేకున్నా పర్లేదు.. మై హూనా అంటాడు. కాసేపటికి మీకు లోన్ రావడం కష్టం. కాబట్టి కొంత ఖర్సవుతుందని అంటాడు. మీరుగానీ చెప్పినంత కడితే.. గంటలో లోన్ గ్యారంటీ అని నమ్మబలుకుతాడు. తర్వాత లోన్ గీన్ జాన్తా నై. కట్టిన డబ్బు హుష్ కాకీ. గ్రూప్ లోంచి గెటవుట్. ఇదీ వరస. ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. జనసేన, పీఎస్ పీకే డై హార్డ్ ఫ్యాన్స్, ఏపీ సీఎం 2024 వంటి గ్రూపుల్లో చేరారో ఇక అంతే సంగతులు. ఒక వేళ చేరినా.. లోన్ కావాలా అని విసిరే ఆ మాయాజాలానికి చిక్కారో ఇక మీ జేబుకు చిల్లే. ఒక కార్యకర్త అయితే ఏకంగా పాతిక వేల వరకూ పోగొట్టుకునన్నాడు.

జనసేన పార్టీ పేరును వాడుకుంటూ.. ఇలాంటి గ్రూపుల్లో డబ్బు దండుకుంటున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు పార్టీ వర్గాల వారు పవన్ కళ్యాణ్‌ ఫోటోలు డీపీగా పెట్టి ఆన్ లైన్ ఫ్రాడ్ కి పాల్పడుతున్న ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ దిశగా రాజమండ్రి అడ్మిన్ అండ్ కో పై సైబర్ సెల్ లో కంప్లయింట్ చేశాం. కాబట్టి ఇలాంటి ఫేక్ గాళ్ల గురించి మీకు తెలిస్తే మాకు చెప్పమంటున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..