Andhra Pradesh: ప్రభుత్వ కార్యాలయాల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు.. అసలు మ్యాటర్ తెలిసి బిత్తరపోయిన అధికారులు..

| Edited By: Ravi Kiran

May 26, 2022 | 1:16 PM

Andhra Pradesh: అనంతపురంలో ఓ యువతి చేసిన పనికి స్థానిక ప్రజలే కాదు.. అధికారులే ఖంగు తిన్నారు. ఖరీదైన చీర కట్టుకుని, ఆఫీసర్ నంటూ

Andhra Pradesh: ప్రభుత్వ కార్యాలయాల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు.. అసలు మ్యాటర్ తెలిసి బిత్తరపోయిన అధికారులు..
Jc
Follow us on

Andhra Pradesh: అనంతపురంలో ఓ యువతి చేసిన పనికి స్థానిక ప్రజలే కాదు.. అధికారులే ఖంగు తిన్నారు. ఖరీదైన చీర కట్టుకుని, ఆఫీసర్ నంటూ సచివాలయానికి ఎంట్రీ ఇచ్చింది. అధికారుల కూర్చిన అంతా చెక్ చేసింది. ఆ తర్వాత పోలీసుల ఎంట్రీతో అసలు యవ్వారం భయటపడింది. అనతపురం జిల్లాకు చెందిన సింధూరి అనే యువతి.. డిగ్రీ చదువుతోంది. అయితే, బుద్ధిగా చదువుకోవాల్సిన ఆమె బుద్ధికి చెదలు పట్టింది. అధికారి నంటూ ఏకంగా ప్రభుత్వ ఆఫీసులనే తనిఖీలు చేయడం మొదలు పెట్టింది. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని.. జాయింట్ కలెక్టర్ లాగా ఫోజులు కొట్టింది. చివరకు పోలీసులకు దొరికి ఊచలు లెక్కిస్తోంది.

యువతి సిందూరి తాను జాయింట్ కలెక్టర్ అంటూ శెట్టూరు సచివాలయం, ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా తనిఖీలు చేసింది. నిఖీలపేరుతో సిబ్బందిని హడలెత్తించింది. రికార్డులను తనిఖీచేస్తూ అధికారులను ఉరుకులుపరుగులు పెట్టించింది. యువతి ఓవర్‌ యాక్షన్‌పై పీహెచ్‌సీ ఆసుపత్రి సిబ్బందికి ఎందుకో అనుమానం కలిగింది. వెంటనే తహసీల్దార్‌, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు.. నకిలీ జాయింట్‌ కలెక్టర్‌గా తేల్చారు. యువతి బత్తులపల్లి మండలం గంటాపురానికి చెందిన సిందూరిగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డిగ్రీ చదువుతున్న సిందూరి ఫేక్‌ జేసీగా ఎందుకు వ్యవహరించిందన్నదానిపై విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.