Job Fruad: నకిలీ అపాయింట్‌మెంట్లు.. రెండు నెలలు జీతాలు.. ఆ తర్వాత ఎస్కేప్..!

| Edited By: Balaraju Goud

Mar 17, 2024 | 6:31 PM

అన్నమయ్య జిల్లా పీలేరులో ఐటీ మోసగాడి వ్యవహారం వెలుగు చూసింది. ఐటి ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డ పీలేరు యువకుడు వందలాది మంది నిరుద్యోగులను బురిడీ కొట్టించాడు. ఢిల్లీ, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 300 మందికి పైగా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టాడు.

Job Fruad: నకిలీ అపాయింట్‌మెంట్లు.. రెండు నెలలు జీతాలు.. ఆ తర్వాత ఎస్కేప్..!
Job Fruad
Follow us on

అన్నమయ్య జిల్లా పీలేరులో ఐటీ మోసగాడి వ్యవహారం వెలుగు చూసింది. ఐటి ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డ పీలేరు యువకుడు వందలాది మంది నిరుద్యోగులను బురిడీ కొట్టించాడు. ఢిల్లీ, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 300 మందికి పైగా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టాడు. ఏపీ తెలంగాణకు సంబంధించిన యువతి యువకులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయట పడింది.

అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన రెడ్డి ప్రసాద్ పలు పేర్లతో చలామణి అవుతూ నిరుద్యోగులను మోసగించినట్లు ఎట్టకేలకు గుర్తించారు.
సినర్జిక్స్ ఐటీ హెచ్ ఆర్ మేనేజర్‌గా భరత్ కుమార్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు తేలిపోయింది. నకిలీ ఐడీలు, అపాయింట్‌మెంట్స్ ఇచ్చిన భరత్ కుమార్ ఒక్కొక్కరితో ఉద్యోగానికి రూ. 2 నుంచి 4 లక్షల దాకా వసూలు చేశాడు. రెండు నెలలు పాటు జీతాలు ఇచ్చి నమ్మించి ఆపై అడ్రస్ లేకుండా పోయిన భరత్ కుమార్ నిరుద్యోగ యువతను నిండా ముంచాడు.

మోసానికి పాల్పడ్డ రెడ్డి ప్రసాద్ అలియాస్ భరత్ కుమార్ పీలేరుకు యువకుడిగా గుర్తించి పీలేరుకు చేరుకున్న వందలాదిమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయమని బాధితులు వేడుకున్నారు. అయితే ఫిర్యాదును తీసుకోని పోలీసులు తమ పరిధిలో జరగలేదని సంబంధం లేదడంతో పోలీసుల తీరుపై బాధిత యువత లబోదిబో మంటోంది. పోలీసు స్టేషన్ వద్దే పడిగాపులు కాసింది. చివరికి ఉన్నతాధికారుల జోక్యంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…