TDP vs BJP: ఆంధ్రాలో రసవత్తర రాజకీయం.. పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కళా వెంకట్రావు..

|

Jan 15, 2021 | 9:01 PM

TDP vs BJP: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత కళా వెంకట్రావ్ పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు.

TDP vs BJP: ఆంధ్రాలో రసవత్తర రాజకీయం.. పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కళా వెంకట్రావు..
Follow us on

TDP vs BJP: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత కళా వెంకట్రావ్ పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. బీజేపీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కళా వెంకట్రావు ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ కళా వెంకట్రావును కలిశారని, బీజేపీలోకి ఆహ్వానించారని వార్తలు ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక జాతీయ పార్టీ ఇటువంటి మైండ్ గేమ్ ఆడటం మంచిది కాదని బీజేపీకి హితవుచెప్పారు. సోము వీర్రాజు కాదు కదా ఏ ఒక్క బీజేపీ నేత కూడా తనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఇటువంటి నీచానికి జాతీయ పార్టీ నేతలు దిగినంత మాత్రాన టీడీపీ పార్టీకి, తనకు జరిగే నష్టమేమీ లేదని కళా వెంకట్రావు ఘాటుగా స్పందించారు.

టీడీపీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఇంతటి స్థాయికి చేరుకున్నానని, తన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని కళావెంకట్రావు స్పష్టం చేశారు. తానే కాదు.. తన వారుసులు సైతం టీడీపీలోనే కొనసాగుతారని తేల్చి చెప్పారు. టీడీపీ బలోపేతం కోసం చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని ఆయన ఉద్ఘాటించారు. ఈ విషయంలో టీడీపీ శ్రేణులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కళావెకంట్రావు క్లారిటీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలం ఏంటో చూపిస్తామని అన్నారు. బీజేపీ నేతలు మైండ్ గేమ్ ఆడటం ఆపితే వారికే మేలు అని కళావెంకట్రావు హితవుచెప్పారు.

Also read:

TDP Leader: వాస్తవాలు ప్రకటిస్తారని అనుకున్నాం.. ఆయన చెప్పినవన్నీ అసత్యాలే..: కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత

Actress Kriti Sanon : మహేష్ హీరోయిన్ కవితకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్‌‌‌‌గా మారిన కృతిసనన్ పోస్ట్