AP Local Body Elections : ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు.. చివరి రోజు హైరేంజ్‌లో సాగిన పాలిటిక్స్..

|

Feb 03, 2021 | 5:34 PM

తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది.  చివరి రోజు ఏపీలో పాలిటిక్స్‌.. హైరేంజ్‌లో నడిచాయి. రేపు నామినేషన్‌ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు.

AP Local Body Elections : ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు.. చివరి రోజు హైరేంజ్‌లో సాగిన పాలిటిక్స్..
Follow us on

Panchayat elections :  తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది.  చివరి రోజు ఏపీలో పాలిటిక్స్‌.. హైరేంజ్‌లో నడిచాయి. రేపు నామినేషన్‌ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. వచ్చే నెల 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ముగుస్తోంది. వచ్చే నెల 9న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌..  తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 3,249 పంచాయతీలు, 32, 504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇదిలావుంటే..ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు.. హోరాహోరీగా పావులు కదిపారు వైసీపీ, టీడీపీ నేతలు. చిత్తూరు జిల్లాలోనూ నామినేషన్లు వేయడానికి వచ్చిన టీడీపీ నేతలను వైసీపీ నేతలు అడ్డుకోవడం వివదాాస్పదమయ్యింది.

అఖరిరోజు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల నామినేషన్ల పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. తొలివిడత ఎన్నికలు జరిగే 168 మండలాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..