కరువు సీమలో వజ్రాల కోసం అన్వేషణ

| Edited By: Srinu

Jul 06, 2019 | 7:32 PM

నిత్యం కరువుతో అల్లాడే ఆ జిల్లాలో వజ్రాలు దర్శనమిస్తున్నాయి. తొలకరి వర్షాలతో భూ ఉపరితలంపై వజ్రాలు ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని సేకరించేందుకు వేలాది మంది ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్, కృష్ణా,గుంటూరు జిల్లాలనుంచి సైతం ఈ వజ్రాల కోసం తరలివస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో దుక్కి భూముల్లో ఈ వజ్రాల వేట కొనసాగుతోంది. ఇక్కడ వజ్రాలు నిజంగానే దొరుకుతున్నాయని, వాటి విలువ కూడా లక్షల్లో పలుకుతుందంటున్నారు అన్వేషకులు. జిల్లాలు దాటుకుంటూ వజ్రాల కోసం […]

కరువు సీమలో  వజ్రాల కోసం అన్వేషణ
Follow us on

నిత్యం కరువుతో అల్లాడే ఆ జిల్లాలో వజ్రాలు దర్శనమిస్తున్నాయి. తొలకరి వర్షాలతో భూ ఉపరితలంపై వజ్రాలు ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని సేకరించేందుకు వేలాది మంది ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్, కృష్ణా,గుంటూరు జిల్లాలనుంచి సైతం ఈ వజ్రాల కోసం తరలివస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే.

కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో దుక్కి భూముల్లో ఈ వజ్రాల వేట కొనసాగుతోంది. ఇక్కడ వజ్రాలు నిజంగానే దొరుకుతున్నాయని, వాటి విలువ కూడా లక్షల్లో పలుకుతుందంటున్నారు అన్వేషకులు. జిల్లాలు దాటుకుంటూ వజ్రాల కోసం జనం తరలివస్తుండటంతో ఆప్రాంతం జనంతో కిటకిటలాడుతోంది.