కేబుల్ పైరసీ కేసు: కోడెల కొడుకు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

|

Jun 03, 2019 | 3:32 PM

ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ సీనియర్ నేత… మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మరో షాక్ తగిలింది. కోడెల కుమారుడు శివరామకృష్ణ అరెస్ట్‌‌కు రంగం సిద్దం అయినట్టు సమాచారం. 2014లో కోడెల గెలుపుతో పాటు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన కుమారుడు శివరామకృష్ణ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. స్పీకర్‌గా ఉన్న తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతడు ప్రజలు వద్ద నుంచి కోడెల టాక్స్‌ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. అయితే ప్రస్తుత […]

కేబుల్ పైరసీ కేసు: కోడెల కొడుకు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Follow us on

ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ సీనియర్ నేత… మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మరో షాక్ తగిలింది. కోడెల కుమారుడు శివరామకృష్ణ అరెస్ట్‌‌కు రంగం సిద్దం అయినట్టు సమాచారం. 2014లో కోడెల గెలుపుతో పాటు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన కుమారుడు శివరామకృష్ణ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. స్పీకర్‌గా ఉన్న తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతడు ప్రజలు వద్ద నుంచి కోడెల టాక్స్‌ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి.

అయితే ప్రస్తుత కేసు మాత్రం కేబుల్ వ్యవస్థలో అక్రమాలకు సంబంధించినది. గుంటూరు జిల్లాలో కేబుల్ బిజినెస్‌ నిర్వహించిన శివ రామకృష్ణ.. పలువురు వ్యాపారులను మోసం చేసి మరీ కోట్లను వెనకేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి.
ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. మరికొందరు కోర్టుకు కూడా వెళ్లారు. ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు.. భారత దేశ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అక్రమాలకి పాల్పడిన మొదటి కేబుల్‌ పైరసీ కేసు ఇదేనంటూ పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు.. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు అణువణువును గాలిస్తున్నారు.  ఆదివారం రాత్రి నుండి కోడెల శివరామక‌ృష్ణకి సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, గుంటూరులోని ఆయనకు సంబంధించిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢిల్లి పోలిసులతో పాటు ఈడీ అధికారులు కూడా పాల్గొన్నారు. దీంతో  కోడెల శివరాం ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.