క్రికెట్ బెట్టింగ్ చేస్తూ దొరికిపోయారు..

| Edited By:

Jul 10, 2019 | 6:15 PM

అభివృద్దికి ఆమడదూరంలో ఉండే శ్రీకాకుళం ప్రాంతంలో ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా క్రికెట్ బెట్టింగ్ పేరుతో నయా దందాకు తెరతీసి కోట్లు కొట్టేస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్ ఆడటం ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని అమాయకులైన యువతను రెచ్చగొట్టడంతో వీరి ఆగడాలకు అంతులేకుండా పోయింది. క్రికెట్‌లో టాస్ గెలిచింది మొదలు విజేతలయ్యే వరకు బెట్టింగ్ దందాను నడిపిస్తూనే ఉంటారు. తాజాగా ఇలాంటి ఓ ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు సిక్కోలు పోలీసులు, జిల్లాలో రోజురోజుకు […]

క్రికెట్ బెట్టింగ్  చేస్తూ దొరికిపోయారు..
Follow us on

అభివృద్దికి ఆమడదూరంలో ఉండే శ్రీకాకుళం ప్రాంతంలో ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా క్రికెట్ బెట్టింగ్ పేరుతో నయా దందాకు తెరతీసి కోట్లు కొట్టేస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్ ఆడటం ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని అమాయకులైన యువతను రెచ్చగొట్టడంతో వీరి ఆగడాలకు అంతులేకుండా పోయింది.

క్రికెట్‌లో టాస్ గెలిచింది మొదలు విజేతలయ్యే వరకు బెట్టింగ్ దందాను నడిపిస్తూనే ఉంటారు. తాజాగా ఇలాంటి ఓ ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు సిక్కోలు పోలీసులు, జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న అరాచకాలపై ఓ కన్ను వేసిన పోలీసులు.. తొమ్మిది మంది సభ్యుల ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్న ఈ కేటుగాళ్ల బృందాన్ని కటకటాల వెనక్కి నెట్టారు.