తీయని విషం… అందులో ఏం కలుపుతున్నారో తెలుసా?

| Edited By:

Aug 21, 2019 | 8:30 AM

కాకినాడ నగరంలోని భానుగుడి జంక్షన్‌ సమీపంలోని మహేంద్ర స్వీట్స్‌పై కార్పొరేషన్‌ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆరోగ్యాధికారి డాక్టర్‌ పి.ప్రశాంత్‌ తన సిబ్బందితో జరిపిన తనిఖీల్లో అవాక్కయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. స్వీట్ల తయారీకి పురుగుపట్టిన శనగపిండి. పుచ్చిన వేరుశనగగుళ్లు, కాలం చెల్లిన స్వీట్ల తయారీ సామగ్రిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆహార తనిఖీ అధికారులకు వారు సమాచారం ఇవ్వడంతో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.వీర్రాజు ఆధ్వర్యంలో ఆ శాఖకు చెందిన అధికారులు అక్కడకు వచ్చి […]

తీయని విషం... అందులో ఏం కలుపుతున్నారో తెలుసా?
Follow us on

కాకినాడ నగరంలోని భానుగుడి జంక్షన్‌ సమీపంలోని మహేంద్ర స్వీట్స్‌పై కార్పొరేషన్‌ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆరోగ్యాధికారి డాక్టర్‌ పి.ప్రశాంత్‌ తన సిబ్బందితో జరిపిన తనిఖీల్లో అవాక్కయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. స్వీట్ల తయారీకి పురుగుపట్టిన శనగపిండి. పుచ్చిన వేరుశనగగుళ్లు, కాలం చెల్లిన స్వీట్ల తయారీ సామగ్రిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆహార తనిఖీ అధికారులకు వారు సమాచారం ఇవ్వడంతో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.వీర్రాజు ఆధ్వర్యంలో ఆ శాఖకు చెందిన అధికారులు అక్కడకు వచ్చి మహేంద్ర స్వీట్‌లో విస్తృతంగా తనిఖీలు చేశారు.

నాణ్యతలేని సరుకులు, కాలం చెల్లిన, నిషేధిత రసాయనాలతో స్వీట్లు, కేక్‌లు తయారు చేస్తున్న విషయాన్ని వారు గుర్తించారు. ఆ షాపు యజమానులు, మధ్యవర్తుల సమక్షంలో అక్కడ అందుబాటులో ఉన్న సరుకును వారు ధ్వంసం చేశారు. లడ్డు, పిస్తాకేక్, హల్వాను పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. అనంతరం ఆ షాపు యజమానికి నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం నోటీసులు జారీ చేసింది. తియ్యటి మిఠాయిల్లో దాగివున్న చేదు నిజాన్ని, అవి తినడం ద్వారా పాడయ్యే ఆరోగ్యాన్ని గుర్తించి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి దుకాణాలపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.