ఒంగోలులో కలకలం..కరోనా పాజిటివ్ వ్యక్తి ఎస్కేప్ ప్లాన్..

|

Mar 19, 2020 | 5:17 PM

ఒంగోలు రిమ్స్ ఐసోలేషన్ వార్డు నుంచి కరోనా వైరస్ సోకిన 23 ఏళ్ల యువకుడు పారిపోయేందుకు యత్నించాడు.  దీంతో ఆస్పత్రి సిబ్బంది అలర్టయి వెంటనే..నాలుగో ప్లోర్‌లో అతడ్ని పట్టుకున్నారు. యువకుడు కొద్దిరోజుల క్రితమే లండన్ నుంచి ఒంగోలు వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా సోకిందన్న మానసిక బాధతోనే అతడు పారిపోయేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఇటీవల సదరు యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేశారు. ఆ రిపోర్టులో అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఒంగోలు […]

ఒంగోలులో కలకలం..కరోనా పాజిటివ్ వ్యక్తి ఎస్కేప్ ప్లాన్..
Follow us on

ఒంగోలు రిమ్స్ ఐసోలేషన్ వార్డు నుంచి కరోనా వైరస్ సోకిన 23 ఏళ్ల యువకుడు పారిపోయేందుకు యత్నించాడు.  దీంతో ఆస్పత్రి సిబ్బంది అలర్టయి వెంటనే..నాలుగో ప్లోర్‌లో అతడ్ని పట్టుకున్నారు. యువకుడు కొద్దిరోజుల క్రితమే లండన్ నుంచి ఒంగోలు వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా సోకిందన్న మానసిక బాధతోనే అతడు పారిపోయేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.

ఇటీవల సదరు యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేశారు. ఆ రిపోర్టులో అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఒంగోలు రిమ్స్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు.

ఇక కరోనా సోకిన వ్యక్తి ఇంటికి చుట్టూ 3 కి.మీ పరిధిమేర ప్రత్యేక జోన్‌గా ప్రకటించి..ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మీడియాకు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఉన్న రోడ్లను కూడా బ్లాక్‌ చేయడంతో పాటు.. ఒంగోలులోని మాల్స్, థియేటర్లు మూసివేయించినట్లు తెలిపారు. కరోనా బాధితుడి ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా రిమ్స్‌ ఐసోలేషన్ వార్డులో ఉంచామని పేర్కొన్నారు.