ఇద్దరు ‘సీఎం’లు కలిసిన ఈ సిత్రం చూశారా..!

| Edited By: Srinu

Dec 24, 2019 | 3:30 PM

ఒక సీఎంకు మరో సీఎంకు స్వాగతం చెప్పడం కామన్ సీన్. కానీ సీఎం జగన్‌కు, సీఎం రమేశ్ స్వాగతం చెప్పడం మాత్రం చాలా రేర్ సీన్. సీఎం హోదాలో స్టీల్ ప్లాంట్ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చెయ్యడానికి కడప వెళ్లారు ఏపీ సీఎం జగన్. ఆయన జమ్మలమడుగు చేరుకోగానే పలువురు వైసీపీ నేతలు స్వాగతం పలికారు. కానీ అనూహ్యంగా అక్కడ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒకింత జగన్‌ కూడా ఆశ్యర్యానికి […]

ఇద్దరు సీఎంలు కలిసిన ఈ సిత్రం చూశారా..!
Follow us on

ఒక సీఎంకు మరో సీఎంకు స్వాగతం చెప్పడం కామన్ సీన్. కానీ సీఎం జగన్‌కు, సీఎం రమేశ్ స్వాగతం చెప్పడం మాత్రం చాలా రేర్ సీన్. సీఎం హోదాలో స్టీల్ ప్లాంట్ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చెయ్యడానికి కడప వెళ్లారు ఏపీ సీఎం జగన్. ఆయన జమ్మలమడుగు చేరుకోగానే పలువురు వైసీపీ నేతలు స్వాగతం పలికారు. కానీ అనూహ్యంగా అక్కడ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒకింత జగన్‌ కూడా ఆశ్యర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు హృదయపూర్వక ఆహ్వానం పలికిన సీఎం రమేశ్..ఆయనను శాలువాతో సత్కరించారు. ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలు కూడా సాగాయి.

ఎన్నికల ముందు వరకు టీడీపీలో కీలక నేతగా మెలిగిన సీఎం రమేశ్‌..అప్పట్లో వైసీపీపై, జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఫలితాల అనంతరం టీడీపీ ఘోరపరాజయంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  కాగా టీడీపీలో ఉన్న సమయంలో సీఎం రమేశ్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కానీ అప్పట్లో కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. తన చిరకాల కోరిక అయిన స్టీల్ ప్లాంట్‌కు జగన్ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వచ్చిన నేపథ్యంలో..ధన్యవాదాలు చెప్పడానికే ఆయన విచ్చేశారని తెలుస్తోంది. అంతేకాదు సీఎం జగన్‌ కడపకు అనేక వరాలు ప్రకటించారు. ముఖ్యంగా కుందూ నదిపై జిల్లా వ్యాప్తంగా వేర్వేరు చోట్ల మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. ఎప్పుడూ కరువుతో అల్లాడే తమ జిల్లాకు..సాగు నీరు అందించడానికి సీఎంగా జగన్ చేస్తోన్న ప్రయత్నం అభినందనీయమని ఎంపీ రమేశ్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట. అదే విషయాన్ని జగన్‌కు కూడా చెప్పినట్టు సమాచారం.

అయితే ఈ మీటింగ్‌పై ప్రత్యర్థుల వెర్షన్ వేరేలా ఉంది. గత ప్రభుత్వం హయాంలో సీఎం రమేశ్‌కి చెందిన కంపెనీలు..ప్రభుత్వానికి సంబంధించిన పలు కాంట్రాక్టులు దక్కించుకున్నాయని, వాటికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకునేందుకే ఆయన సీఎంతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నిస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఈ కామెంట్స్‌పై సీఎం రమేశ్ ఎలా రెస్పాండ్ అవుతారో చూాడాలి.