సీఎం హోదాలో తొలిసారిగా.. రేపు జగన్ కడప జిల్లా పర్యటన

| Edited By:

Jul 07, 2019 | 3:12 PM

ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి కడప జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత సీఎం వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు . ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. గండి క్షేత్రంలో ఆలయ అభివృద్ది పనులు ప్రారంభించిన తర్వాత పులివెందులలో వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా అరటి పరిశోధన కేంద్రానికి శంకుస్ధాపన చేయనున్నారు. అదేవిధంగా జమ్మలమడుగులో జరగనున్నబహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ప్రభుత్వం […]

సీఎం హోదాలో తొలిసారిగా..  రేపు జగన్ కడప జిల్లా  పర్యటన
Follow us on

ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి కడప జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత సీఎం వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు . ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. గండి క్షేత్రంలో ఆలయ అభివృద్ది పనులు ప్రారంభించిన తర్వాత పులివెందులలో వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా అరటి పరిశోధన కేంద్రానికి శంకుస్ధాపన చేయనున్నారు. అదేవిధంగా జమ్మలమడుగులో జరగనున్నబహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి అనేక కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. వీటిలో భాగంగా రైతులకు మద్దతు ధర, అలాగే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెరిగిన పెన్షన్లను అందించనున్నారు.

మరోవైపు సీఎం జగన్ బహిరంగ సభకు సంబంధించి ముద్దనూరు రోడ్డులో భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 వేలమంది కూర్చునేందుకు వీలుగా సభా ప్రాంగణాన్ని, 75 మంది కూర్చునేలా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగసభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతితో కలిసి ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారు.