జాస్తి కృష్ణ కిశోర్‌‌కు సీఐడీ ఝలక్..

| Edited By:

Dec 16, 2019 | 10:56 PM

ఏపి ఆర్ధిక అభివృద్ది మండలి మాజీ సిఈఓ జాస్తి కృష్ణ కిశోర్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్‌ 188, 403, 409, 120 (B) కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఐఆర్ఎస్ అధికారి అయిన జాస్తి కృష్ణ కిషోర్‌ని ఇటీవలే ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో.. ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన ఆయనపై.. అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పరిశ్రమలు,మౌలిక వసతుల శాఖ […]

జాస్తి కృష్ణ కిశోర్‌‌కు సీఐడీ ఝలక్..
Follow us on

ఏపి ఆర్ధిక అభివృద్ది మండలి మాజీ సిఈఓ జాస్తి కృష్ణ కిశోర్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్‌ 188, 403, 409, 120 (B) కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఐఆర్ఎస్ అధికారి అయిన జాస్తి కృష్ణ కిషోర్‌ని ఇటీవలే ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో.. ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన ఆయనపై.. అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పరిశ్రమలు,మౌలిక వసతుల శాఖ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకున్న జగన్ ప్రభుత్వం.. జాస్తి కృష్ణ కిషోర్‌పై కేసు నమోదు చేయాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఆయన పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలపై ఆరు నెలల్లోగా విచారణ పూర్తిచేయాలని ఆదేశించింది. అదేసమయంలో విచారణ పూర్తయ్యేవరకు కృష్ణ కిషోర్ అమరావతి విడిచి వెళ్లరాదంటూ ప్రభుత్వం పేర్కొంది.