Viral Video: అయ్యో.. అయ్యయ్యో.. ఈ వీడియో చూస్తే మందుబాబుల గుండె బద్దలవ్వాల్సిందే..

|

Jul 25, 2024 | 5:49 PM

మందు బాటిళ్లను మంచిగా కింద పరిచేశారు.. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు.. ఇక్కడ మద్యం బాటిళ్లను పంపిణీ చేస్తున్నారనుకునేరు.. అసలు మ్యాటర్ వేరే ఉంది.. మొత్తం కథ తెలిస్తే మందుబాబుల గుండె చివుక్కుమంటుంది.. గుట్టలు గుట్టులుగా మద్యం బాటిల్స్ వరుసగా పెర్చిన పోలీసులు.. వాటిపై నుంచి రోడ్డు రోలర్ ను నడిపారు.. క్షణాల్లోనే మద్యం మొత్తం నేలపాలైంది..

Viral Video: అయ్యో.. అయ్యయ్యో.. ఈ వీడియో చూస్తే మందుబాబుల గుండె బద్దలవ్వాల్సిందే..
Liquor Bottles
Follow us on

మందు బాటిళ్లను మంచిగా కింద పరిచేశారు.. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు.. ఇక్కడ మద్యం బాటిళ్లను పంపిణీ చేస్తున్నారనుకునేరు.. అసలు మ్యాటర్ వేరే ఉంది.. మొత్తం కథ తెలిస్తే మందుబాబుల గుండె చివుక్కుమంటుంది.. గుట్టలు గుట్టులుగా మద్యం బాటిల్స్ వరుసగా పెర్చిన పోలీసులు.. వాటిపై నుంచి రోడ్డు రోలర్ ను నడిపారు.. క్షణాల్లోనే మద్యం మొత్తం నేలపాలైంది.. సుమారు 27 లక్షల రూపాయల విలువ గల అక్రమ మద్యం, నాటు సారాను చిత్తూరు సబ్-డివిజన్ పోలీసులు ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు ఆదేశానుసారం చిత్తూరు సబ్ డివిజన్ డి.ఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మద్యం ధ్వంసం డ్రైవ్ నిర్వహించారు. చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలోని యాదమరి, తవనంపల్లె, గుడిపాల పోలీస్ స్టేషన్ లలో నమోదైన 116 కేసులలో పట్టుబడిన, సీజ్ చేసిన సుమారు 27లక్షల విలువ గల 3240 లీటర్ల అక్రమ మద్యం, 1258 లీటర్ల నాటు సారను యాదమరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పెరుమాళపల్లి గ్రామం నందు రోడ్ రోలర్ అధికారుల సమక్షంలో ధ్వంస చేసినట్లు పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలోని యాదమరి – 40 కేసులు, తవనంపల్లె – 08 కేసులు, గుడిపాల – 68 కేసులు మొత్తం 116 కేసులలో పట్టుబడిన, సీజ్ చేసిన అక్రమ మద్యం, నాటు సారను ధ్వంసంచేశామని చిత్తూరు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి తెలిపారు. సమాజం కోసం, కుటుంబం కోసం చట్టాలు పాటించాలి.. అక్రమ రవాణాకు దూరంగా ఉండాలంటూ హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..