మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించాలిః చిరంజీవి

|

Dec 21, 2019 | 4:57 PM

అమరావతిలో అసెంబ్లీ కొనసాగిస్తూ విశాఖలో సచివాలయం ఏర్పాటు చేయాలని సూచించింది జీఎన్‌రావు కమిటీ.  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి.. విశాఖపట్నం, అమరావతిలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. రాజధాని అంశం చెప్పకుండా మూడు పరిపాలనా ప్రాంతాలు, నాలుగు పరిపాలనా మండళ్లు అంటూ జి ఎన్ రావు ఇచ్చిన నివేదికపై ఇప్పుడు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రాజధాని ఎక్కడ అనే ప్రశ్నను జి ఎన్ రావుకి వేసిన సందర్భంలో రాజధానిని నిర్ణయించవలసింది ప్రభుత్వమే తప్ప తాము కాదని […]

మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించాలిః చిరంజీవి
Follow us on

అమరావతిలో అసెంబ్లీ కొనసాగిస్తూ విశాఖలో సచివాలయం ఏర్పాటు చేయాలని సూచించింది జీఎన్‌రావు కమిటీ.  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి.. విశాఖపట్నం, అమరావతిలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. రాజధాని అంశం చెప్పకుండా మూడు పరిపాలనా ప్రాంతాలు, నాలుగు పరిపాలనా మండళ్లు అంటూ జి ఎన్ రావు ఇచ్చిన నివేదికపై ఇప్పుడు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రాజధాని ఎక్కడ అనే ప్రశ్నను జి ఎన్ రావుకి వేసిన సందర్భంలో రాజధానిని నిర్ణయించవలసింది ప్రభుత్వమే తప్ప తాము కాదని ఆయన తేల్చి చెప్పారు..ఈ కమిటీ నివేదికపై ఈ నెల 27వ తేదిన జగన్ క్యాబినేట్ చర్చించనుంది.. అలాగే రాజధాని అంశంపై వేసిన మరో టెక్నికల్ కమిటీ బోస్టన్ నివేదిక కోసం జగన్ ప్రభుత్వం ఎదురు చూస్తున్నది.. ఆ నివేదిక లోని అంశాలు, జి ఎన్ రావు కమిటీలో విషయాలు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.ఇదిలా ఉంటే, మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. సీఎం చేసిన మూడు రాజధానుల ప్రకటనపై చిరంజీవి స్పందించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని చిరంజీవి అన్నారు